స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. వెక్కి వెక్కి ఏడుస్తున్న పాయల్ రాజ్ పుత్

- Advertisement -


గ్లామర్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత ఆ సినిమాలో అమ్మడు చూపిన అందచందాలు ఇప్పటికీ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఆ సినిమా తర్వాత తన కెరీర్లో వచ్చే అవకాశాలన్నీ అలాంటి పాత్రలే కావడంతో పాయల్ పేరు ఓ రేంజ్ లో మోత మోగిపోయింది. తొలి సినిమాతోనే రొమాంటిక్ యాంగిల్ లో రెచ్చిపోయిన ఈ బ్యూటీ కి ఎందుకోగానీ బడా హీరోలు అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు.

ఆర్ఎక్స్ 100 తర్వాత వచ్చిన తను నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మారాయి. ఇటీవల వచ్చిన మంగళవారం సినిమా మాత్రమే హిట్ టాక్ అందుకుంది. కాగా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ .. రీసెంట్ గా పెట్టిన పోస్ట్ అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఆమె తన పెట్ డాగ్ ను కోల్పోయింది. ఈ మేరకు తన పెట్ డాగ్ తో ఉన్న ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఎమోషన్ అయింది.

“క్షమించు క్యాండి.. ఈ అమ్మ నిన్ను కాపాడుకోలేకపోయింది .. చాలా చాలా బాధగా ఉంది . గుండెలు పగిలిపోతున్నాయి. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐ మిస్ యు అంటూ చాలా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది”. తన పెట్ డాగ్ తో ఉన్న ఫొటోస్ కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి..!!

- Advertisement -

https://www.instagram.com/p/C1gVRiaK9Eh/?utm_source=ig_embed&ig_rid=37894f42-2934-4296-9851-5ada2273322a

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here