Akkineni Nagarjuna : ప్రతీ ఏడాది సంక్రాంతి వచ్చిందంటే రెండు మూడు సినిమాలు విడుదల అవ్వడం సర్వసాధారణమే. కానీ ఈసారి ఏకంగా 5 తెలుగు సినిమాలతో పాటుగా, రెండు డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల అయ్యాయి. ఇన్ని సినిమాలు విడుదల అవ్వడం వల్ల, వీటితో పాటు విడుదల అవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి థియేటర్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఈ సినిమాకి దాదాపుగా 160 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
మహేష్ మరియు త్రివిక్రమ్ కి ఉన్న బ్రాండ్ ఇమేజి కారణంగా ఈ రేంజ్ బిజినెస్ జరిగింది అని చెప్పొచ్చు. బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి రావాలంటే కచ్చితంగా సోలో గ్రౌండ్ ఉండాలి. కానీ ప్రతీ ప్రాంతం లోను మహేష్ సినిమాకి థియేటర్స్ భారీగా కొరత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్చల ద్వారా కొన్ని సినిమాలను పక్కకి తప్పించాలని చూసారు, కానీ ఒక్క సినిమా కూడా సంక్రాంతి రేస్ నుండి తప్పుకోడానికి సిద్ధంగా లేదు.
ముఖ్యంగా నాగార్జున ‘నా సామీ రంగ’ టీం ని ‘గుంటూరు కారం’ టీం సంక్రాంతి రేస్ నుండి తప్పుకోవాల్సిందిగా చాలా వరకు రిక్వెస్ట్ చేసారు. కానీ నాగార్జున మాత్రం ససేమీరా ఒప్పుకోలేదు. మిగతా వాళ్ళ సంగతి మాకు అనవసరం, మాది పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా, మేము సంక్రాంతికే వస్తున్నాం అని తెగేసి చెప్పాడట.
కానీ నా సామి రంగ మేకర్స్ మాత్రం థియేటర్స్ దొరకడం కష్టం కదా, సంక్రాంతి రేస్ నుండి తప్పుకోవడం బెటర్ ఏమో అని నాగార్జున ముందు అనగా, అప్పుడు నాగార్జున రియాక్షన్ ని చూసి నిర్మాతలు షాక్ అయ్యినట్టు తెలుస్తుంది. ‘అవసరం అయితే నేను ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోను, లాభాలు వచ్చినప్పుడే ఇవ్వండి, సంక్రాంతికి సినిమా కచ్చితంగా ఉండాలి’ అని నాగార్జున చాలా సీరియస్ గా చెప్పాడట. ఇక ఆయన మాట కాదు అనలేక సంక్రాంతికే విడుదల చెయ్యాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు.