మిగతా భాషల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్స్ కంటే ఎక్కువగా మన తెలుగు భాషలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్స్ కి ఆదరణ ఎక్కువ. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన ప్రతీ సీజన్ పెద్ద హిట్ అయ్యింది కానీ, సీజన్ 7 అన్నిటికంటే పెద్ద హిట్. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రెండవ సీజన్ కి న్యాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
ఇక మూడవ సీజన్ నుండి 7 వ సీజన్ వరకు వరుసగా 5 సీజన్స్ కి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. మధ్యలో ఒక ఓటీటీ సీజన్ కూడా చేసాడు. అంటే మొత్తం కలిపి ఆరు సీజన్స్ కి హోస్ట్ గా చేసాడు అన్నమాట. బిగ్ బాస్ సీజన్ 2 అప్పుడు ఒక ఎపిసోడ్ కి అతిథి గా వచ్చిన నాగార్జున ఈ షో నాకు నచ్చదు, అసలు అన్ని రోజులు ఆ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటున్నారు మీరు అని కంటెస్టెంట్స్ తో అనేవాడు.
బిగ్ బాస్ మీద అలాంటి అభిప్రాయం ని కలిగియున్న నాగార్జున, ఇన్ని సీజన్స్ కి హోస్ట్ గా ఎందుకు వ్యవహరించాడు అనేది చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న. నాగార్జున ఇన్ని సీజన్స్ చెయ్యడానికి అసలు కారణం డబ్బులు. ఇప్పటి వరకు ఆరు సీజన్స్ కి కలిపి నాగార్జున దాదాపుగా 150 కోట్ల రూపాయలకు పైగానే సంపాదించాడట. ఇది సాధారణమైన విషయం కాదు, అందుకే ఆయన క్రమం తప్పకుండా ప్రతీ సీజన్ లోను హోస్ట్ గా వ్యవహరిస్తూ వచ్చాడు.
ఫిబ్రవరి లో ప్రారంభం అవ్వబొయ్యే బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్ కి, అలాగే వచ్చే ఏడాది మధ్యలో రాబొయ్యే బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడని టాక్. గడిచిన దశాబ్ద కాలం లో సినిమాల నుండి నాగార్జున ఇంత సంపాదించలేదు, అలాంటిది బిగ్ బాస్ ద్వారా ఈ రేంజ్ లో సంపాదించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.