Caption VijayKanth : డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయకాంత్ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల డీఎండీకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ మరణంతో ఆయన నివాసం, కార్యాలయంలో తీవ్ర విషాదం నెలకొంది. విజయకాంత్ చికిత్స పొందుతున్న ఎంఐటీటీ ఆస్పత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో, న్యుమోనియా కారణంగా ఆస్పత్రిలో చేరిన విజయకాంత్ వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.
నిజానికి విజయకాంత్ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతుండటంతో రాజకీయ, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కొంతకాలం క్రితమే ఆయన కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. దీంతో ఆయనకు నిత్యం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతూ ఉదయం అకస్మాత్తుగా మరణించాడు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ సోషల్ మీడియాలో రాసిన ఓ పోస్ట్ కలకలం రేపుతోంది. తమిళనాడు మంత్రి ఉదయనిధికి బహిరంగ లేఖ రాశారు. దాంట్లో నేను కేరళ నుంచి వచ్చి మీ ఆఫీసులో కూర్చొని రాజకీయాల్లోకి వెళ్లమని చెప్పాను. కరుణానిధిని చంపింది ఎవరు? జయలలితను ఎవరు చంపారు? అన్నది తెలుసుకోవాలని చెప్పాను. ఇప్పుడు విజయ్ కాంత్ ను ఎవరు చంపారో తెలుసుకోవాల్సి వచ్చింది.
విజయ్ కాంత్ ది హత్య అని అర్థం వచ్చేలా రాసుకొచ్చారు. మీరు దీన్ని పట్టించుకోకపోతే ఇండియన్ 2 సెట్‌లో స్టాలిన్, కమల్ హాసన్‌లను చంపడానికి ప్రయత్నించారు. ఇప్పుడు కిల్లర్స్ మిమ్మల్ని లేదా స్టాలిన్ సార్‌ను టార్గెట్ చేశారు. నువ్వు నా నీరమ్ సినిమా హిట్ అయిందని 15 నిమిషాల్లో యాపిల్ సెంటర్‌కి ఫోన్ చేసి ఫోన్ తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చారని, ఈ హత్యలు ఎవరు చేశారో తెలిసిందని దాని కంటే సింపుల్ అని రాశాడు. మరి అల్ఫోన్స్ మాటలపై ఉదయనిధి ఎలా స్పందిస్తాడో చూడాలి.