Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా కామన్ మ్యాన్ గా ఒక రైతు బిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ నిల్చిన సంగతి మన అందరికి తెలిసిందే. అయితే ఆయన టైటిల్ గెలిచి బయటకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు, దాని వల్ల ప్రశాంత్ జైలుకి వెళ్లి బైల్ మీద రావడం, ఇలాంటివన్నీ ఆయన అభిమానుల్ని ఎంతగానో బాధించాయి. కానీ ఇందులో పోలీసుల తప్పు ఏమి లేదు. ప్రశాంత్ వాళ్ళ ఆదేశాలను లెక్క చెయ్యకుండా ర్యాలీ చెయ్యడం ప్రశాంత్ తప్పే.
ఆ పొరపాటు కారణంగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్లు ద్వంసం అవవడానికి కారణం అయ్యాయి. కేవలం అతను చేసిన పొరపాటు వల్లే బిగ్ బాస్ యాజమాన్యం కూడా పోలీసులకు జవాబు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కారణంగా రాబొయ్యే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో, అలాగే ఆ తర్వాత ప్రసారం అవ్వబొయ్యే బిగ్ బాస్ సీజన్ 8 లో చాలా కీలక మార్పులు రాబోతున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ప్రతీ కంటెస్టెంట్ చేత అగ్రిమెంట్ చెయ్యించుకుంటుంది బిగ్ బాస్ యాజమాన్యం. ఆ అగ్రిమెంట్ లో ఎన్నో కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని సవరించబోతున్నారు ఈసారి. అందులో మొదటిది బిగ్ బాస్ షో ముగించుకొని బయటకి వెళ్ళేటప్పుడు స్టూడియో ఆవరణలో ఎలాంటి ర్యాలీలు కూడా చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే చాలా కఠినమైన చర్యలు బిగ్ బాస్ యాజమాన్యం నుండి ఉంటాయట.
అందులో మొదటిది స్వయంగా బిగ్ బాస్ టీం నుండి కంటెస్టెంట్ ని జైలుకి పంపడడం తో పాటుగా, రెమ్యూనరేషన్ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వబోరట. వీటితో పాటుగా వృత్తిని అడ్డం పెట్టుకొని సింపతీ గేమ్స్ కూడా ఇక బ్యాన్ చేస్తున్నట్టు బిగ్ బాస్ యాజమాన్యం ఆ ఒప్పందం లో పెర్కనబోతుందట. ఎందుకంటే ఈ సీజన్ లో రైతు బిడ్డ అనే ట్యాగ్ కారణంగా పెద్ద సమస్యలే ఎదురు అయ్యాయి. ప్రశాంత్ మీద ఎవరు అరిచినా రైతు మీద అరిచినట్టుగా బయటకి వెళ్ళింది. ఆ ప్రభావం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే రన్నర్ అమర్ దీప్ కుటుంబం పై జరిగిన దాడిని ఉదాహరణగా తీసుకోవచ్చు.