Priyanka Mohan : సినిమాల్లోకి రాకముందు హీరోయిన్ ప్రియాంక మోహన్ అలాంటి చీప్ పనులు చేసేదా..?చూస్తే కన్నీళ్లు ఆగవు!

- Advertisement -

Priyanka Mohan : ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో ప్రియాంక అరుళ్ మోహన్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. క్యూట్ అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కించడమే కాకుండా, తన సహజమైన నటనతో మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. తెలుగు , తమిళం , మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ప్రియాంక మోహన్, తెలుగు లో నాని ‘జెంటిల్ మ్యాన్’ ,అలాగే శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రాల ద్వారా మన ఆడియన్స్ కి దగ్గరైంది.

ఇక ఆమె శివ కార్తికేయన్ తో కలిసి నటించిన ‘డాక్టర్’ మరియు ‘డాన్’ సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓజీ’ అలాగే నాని ‘గుర్తుందా శనివారం’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటుగా మరికొన్ని క్రేజీ టాలీవుడ్ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.

ప్రస్తుతం ఆమె కెరీర్ మంచి పీక్ రేంజ్ లోనే ఉంది..ఒక్కో సినిమాకి రెండు నుండి మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుతుంది. మరో ఐదేళ్ల వరకు ఆమె మేనియా సౌత్ లో నడవొచ్చు. కానీ ఆమె ఈ రేంజ్ కి రావడానికి ఎన్ని కష్టాలు పడిందో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఆమె కుటుంబం ఆర్థికంగా బాగా వెనకబడిన కుటుంబం అట. సినిమాల మీద ఇష్టం తో ఈ రంగం ని ఎంచుకుంది. మొదట్లో ఈమెకి కొన్ని యాడ్స్ చేసే అవకాశం దక్కింది.

- Advertisement -

కానీ అన్నీ చిన్న చిన్న చీప్ యాడ్స్ అవ్వడం వల్ల రెమ్యూనరేషన్ చాలా తక్కువగా వచ్చేది అట. ఆ డబ్బులు ఇంట్లో తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోయేవి అట. ఇక ఇంటి అవసరాలకు, అలాగే తన అవసరాలకు కూడా ఆ డబ్బులు సరిపోక ఎన్నో ఇబ్బందులను ఎదురుకుందట. అలా సినిమాల్లోకి రాకముందు తాను పడిన కష్టాల గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యింది ప్రియాంక.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here