Manchu Manoj : రీసెంట్ గానే మంచు మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ భూమా మౌనికని రెండవ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరికీ కూడా ఇది రెండవ వివాహమే. భూమా మౌనిక కి తన మొదటి భర్త తో ఒక మగ సంతానం కూడా పొందింది. మంచు మనోజ్ ఆ బిడ్డని కూడా అంగీకరించి తన కొడుకు గా స్వీకరించి మౌనిక ని వివాహం చేసుకున్నాడు.
చిలకా గోరింకా లాగ ఎంతో అన్యోన్య దాంపత్య జీవితం గడుపుతున్న ఈ ఇద్దరు రీసెంట్ గానే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఒక శుభ వార్త తెలియచేసాడు. మౌనిక రెండవ సారి గర్భవతి అయ్యింది అంటూ సోషల్ మీడియా లో మంచు మనోజ్ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అభిమానులందరూ మనోజ్ కి మరియు మౌనిక కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
ఇప్పుడు మౌనిక కి 5 వ నెల అట..నిన్న గాక మొన్న పెళ్లి చేసుకున్నట్టుగా అనిపిస్తున్న ఈ జంటకి అప్పుడే ఒక బిడ్డ పుట్టబోతుండడం తో మంచు అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఇకపోతే చాలా కాలం గ్యాప్ తర్వాత మంచు మనోజ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరో గా ‘వాట్ ది ఫిష్’ అనే చిత్రం తెరకెక్కుతుంది.
ఈ సినిమా తో పాటుగా మరో రెండు సినిమాలు కూడా ఒప్పుకున్నాడు. మరోపక్క ఆయన కెరీర్ లో మొట్టమొదటిసారిగా హోస్ట్ గా వ్యవహరిస్తూ ‘ఉస్తాద్’ అనే షో చేస్తున్నాడు. ఈ షో ఈటీవీ లో ప్రసారం కానుంది. టాలీవుడ్ కి సంబంధించిన టాప్ సెలబ్రిటీస్ అందరూ ఈ షో లో అతిధులుగా పాల్గొంటారు. మొదటి ఎపిసోడ్ కి న్యాచురల్ స్టార్ నాని విచ్చేశాడు, ఇప్పుడు రెండవ ఎపిసోడ్ కి రానా దగ్గుపాటు విచేయబోతున్నాడు.