Rajinikanth : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో రజినీకాంత్ చిత్రం లో ఏ ఆర్టిస్టుకి అయినా చిన్న పాత్ర వచ్చినా ఒక అదృష్టం లాగ భావిస్తారు. ఎందుకంటే ఆయన సినిమాలో నటిస్తే ఇండియా మొత్తానికి పరిచయం అయ్యినట్టే. అంతే కాదు రజినీకాంత్ కి ఉన్నంత ఓవర్సీస్ మార్కెట్ విదేశాల్లో ఏ హీరోకి కూడా లేదు. ఈ ఏడాది విడుదలైన ‘జైలర్’ చిత్రం ఓవర్సీస్ లో 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది సాధారణమైన విషయం కాదు.
అందుకే ఆయన చిత్రం లో చిన్న పాత్ర చెయ్యడానికి స్టార్ హీరోయిన్స్ సైతం ఎగబడుతూ ఉంటారు. అయితే ఒక హీరోయిన్ కి మాత్రం రజినీకాంత్ చిత్రం లో హీరోయిన్ గా నటించడం బాగా మైనస్ అయ్యిందట. అప్పటి నుండి నాకు ఎక్కువగా అలాంటి పాత్రలే వస్తున్నాయి అంటూ ఈ హీరోయిన్ లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ ఆ మారింది.
ఇక అసలు విషయానికి వస్తే ‘జైలర్’ చిత్రం కంటే ముందు రజినీకాంత్ ‘అన్నాతే’ అనే సినిమా చేసాడు. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. తెలుగు లో ఈ చిత్రం ‘పెద్దన్న ‘ పేరుతో విడుదలైంది, ఇక్కడ కూడా ఆ సినిమాకి అదే ఫలితం వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ స్టార్ హీరో కీర్తి సురేష్ రజినీకాంత్ కి చెల్లెలు గా నటించింది. హీరోయిన్ గా ఇండస్ట్రీ లో గొప్ప స్థాయిలో కొనసాగుతున్న సమయం లో ఇలా చెల్లెలు పాత్ర చేస్తే కెరీర్ రిస్క్ లో పడుతుందేమో అని కూడా ఆలోచించకుండా ఆమె ఈ పాత్ర చేసింది.
పేరుకి చెల్లి పాత్ర అయినా సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమా తర్వాత వెంటనే ఆమెకి చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్’ చిత్రం లో కూడా చెల్లి పాత్రనే వచ్చింది. ఈ రెండు సినిమాల ప్రభావం వల్ల కీర్తి సురేష్ కి ఇప్పుడు ఎక్కువగా హీరోయిన్ రోల్స్ కంటే, అలాంటి పాత్రలే వస్తున్నాయట. దీనికి ఆమె రజినీ గారి సినిమాలో చెల్లి క్యారక్టర్ చెయ్యడం నాకు శాపం లా మారిందే అంటూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.