Ravi Teja : ఇండస్ట్రీ కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి నేడు స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోలలో ఒకడు మాస్ మహారాజా రవితేజ. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన రవితేజ ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్టుగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఇలా ఎన్నో రకాల పాత్రలు చేసాడు. అలా వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్లిన రవితేజ కి హీరో గా మారిన తర్వాత సక్సెస్ ని చూడడానికి పెద్ద సమయం ఏమి పట్టలేదు.
సమయానికి పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ తో ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సినిమాలు పడడం ఆయన చేసుకున్న అదృష్టం. ఈ సినిమాల తర్వాత రవితేజ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నేడు ఆయన ఏ స్థానం లో ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం.
అయితే రవితేజ జూనియర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ సమయం లో ఆయనకీ నిర్మాతలు కేవలం 10 రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే ఇచ్చేవారట. ముఖ్యంగా రాజశేఖర్ హీరో గా నటించిన అల్లరి ప్రియుడు సినిమా మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాలో రవితేజ ఒక చిన్న క్యారక్టర్ చేసాడు. స్నేహితుల గ్యాంగ్ లో బండ్ల గణేష్ కి కూడా మంచి డైలాగ్స్ ఉంటాయి కానీ రవితేజ కి మాత్రం ఉండవు.
అలాంటి క్యారక్టర్ చేసిన రవితేజ కి రోజుకి 10 రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే ఇచ్చారట. ఇదంతా విన్న తర్వాత బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన ఒక వ్యక్తి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా అని జాలి వెయ్యక తప్పదు. అయితే అలాంటి పరిస్థితి నుండి నేడు ఒక్కో సినిమాకి 30 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి రవితేజ ఎదిగాడు అంటే సాధారణమైన విషయం కాదు.