Prince Yawar : ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనమంతా చూసాము. ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ సీజన్స్ లో ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, ఎమోషన్స్ పరంగా కానీ ఒక రోలర్ కోస్టర్ లాగ ఉండింది ఈ సీజన్. ఈ సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిస్తే , రన్నర్ గా అమర్ దీప్ నిలిచాడు. అయితే టాప్ 4 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన 15 లక్షల ఆఫర్ ని తీసుకొని చాలా తెలివైన పని చేసాడు యావర్.

యావర్ మొదటి వారం నుండి పడిన కష్టం కి తగ్గ ఫలితం దక్కింది అని అందరూ అనుకున్నారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యావర్ తనకి వచ్చిన డబ్బుల గురించి చెప్పొచ్చాడు. 15 లక్షలు తీసుకొని వెళ్లిపోయానని అందరు అనుకున్నారు, కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

ఇచ్చిన 15 లక్షలు చేతికి రావని , 35 శాతం ఎంటర్టైన్మెంట్ టాక్స్ ని కట్ చేసుకొని ఇచ్చారని, అంటే కేవలం 10 లక్షలు మాత్రమే చేతికి వచ్చిందని యావర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. టాక్స్ ఎదో లక్ష రెండు లక్షలు ఉంటే పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఏకంగా 5 లక్షలు టాక్స్ అంటే ఇది ముమ్మాటికీ మోసమే. ఇక పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ లో కూడా ఇంతే.

35 లక్షల రూపాయలలో 35 శాతం తీసేస్తే కేవలం 23 లక్షలు మాత్రమే పల్లవి ప్రశాంత్ అనుకున్నాడు. అంటే ఏకంగా 12 లక్షలు కట్ చేశారన్నమాట. కంటెస్టెంట్స్ ని ఉపయోగించుకొని అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ సంపాదిస్తూ, వాళ్లకు మాత్రం ప్రైజ్ మనీ మరియు రెమ్యూనరేషన్ దగ్గర ఈ రేంజ్ కొరతలు పెట్టడం అమానుషం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.