Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ తో పెళ్ళికి రెడీ అంటూ రతికా షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Pallavi Prashanth : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో బీభత్సమైన లవ్ ట్రాక్స్ ని ఆశించారు ఆడియన్స్. ఎందుకంటే హౌస్ లో అలాంటి వాతావరణాలు ఏర్పడ్డాయి కాబట్టి. పల్లవి ప్రశాంత్ మరియు రతికా మధ్య లవ్ ట్రాక్. అలాగే గౌతమ్ మరియు శుభశ్రీ మధ్య లవ్ ట్రాక్ ప్రారంభం అయ్యింది. మధ్యలో రతికా తో పల్లవి ప్రశాంత్ మరియు ప్రిన్స్ యావర్ ట్రైయాంగులర్ లవ్ స్టోరీ కూడా ట్రై చేసారు. కానీ వర్కౌట్ అవ్వలేదు.

మధ్యలోనే ఈ లవ్ ట్రాక్స్ అన్నీ ఆగిపోయాయి. ముఖ్యంగా రతికా మరియు పల్లవి ప్రశాంత్ లవ్ ట్రాక్ అయితే సినిమాటిక్ రూట్ లో బ్రేక్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ కి ఎదో సాధించడానికి వచ్చావా, నన్ను సాధించడానికి వచ్చావా అంటూ పల్లవి ప్రశాంత్ గుండె బద్దలు అయ్యే రేంజ్ మాటలు మాట్లాడి రతికా పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్ అక్కా అని పిలవడం మొదలు పెట్టాడు.

రతికా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ని అక్కా అని పిలవొద్దు అంటూ అతని దగ్గరకి వెళ్లి ఏడుస్తుంది. అయినా ప్రశాంత్ మాట వినడు, ఒక్కసారి అక్కా అని పిలిస్తే ఇక నా దృష్టిలో అక్కానే అవ్వుద్ది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘ఈ కంటెస్టెంట్స్ లో మీరుతు ఎవరితో డేట్ చేస్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఎవరిని చంపేస్తారు ‘ అని యాంకర్ అడగగా, పల్లవి ప్రశాంత్ ని పెళ్లి చేసుకుంటాను అని సమాధానం ఇచ్చి అందరినీ షాక్ కి గురి అయ్యేలా చేసింది. ప్రశాంత్ బయటకి వచ్చిన తర్వాత కానీ , అతను అరెస్ట్ అయిన తర్వాత కానీ రతికా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ ఒక్కసారిగా ఇలా మాట్లాడేలోపు మళ్ళీ ఎదో డ్రామా మొదలు పెట్టింది అంటూ ప్రశాంత్ ఫ్యాన్స్ రతికా పై కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here