Ravi Teja : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి చిన్న చిన్న పాత్రలను చేసుకుంటూ ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా ఎదిగిన వారిలో ఒకడు మాస్ మహారాజ రవితేజ. ఆయన ఎదగడమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేక టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరికి ఆదర్శంగా నిలిచాడు. చిరంజీవి తర్వాత అలాంటి వారికి రోల్ మోడల్ గా నిలిచాడు రవితేజ.
కెరీర్ ప్రారంభం లో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి, ఆ తర్వాత లైట్ మెన్ గా కెరీర్ ని ప్రారంభించి, అసిస్టెంట్ డైరెక్టర్ రేంజ్ కి ఎదిగి ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ కి పని చేసాడు. అప్పట్లో రవితేజ కి పాపం రెమ్యూనరేషన్ సరిగా ఇచ్చేవాళ్ళు కూడా కాదట. రెండు వేలు, మూడు వేలు చేతిలో అకౌంట్ పండగ చేసుకునే పరిస్థితి ఉండేది. ఆ డబ్బుల కోసం ఆయన వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకున్నాడు.
ఉదాహరణకి మీకెవ్వరికీ తెలియని ఒక విషయం చెప్పాలి. అప్పట్లో దూరదర్శన్ ఛానల్ లో ‘ఋతురాగాలు’ అనే సీరియల్ వచ్చేది. ఈ సీరియల్ లో రాజీవ్ కనకాల హీరో గా నటించాడు. ఇందులో రవితేజ ఒక చిన్న పాత్రని ఒక ఎపిసోడ్ లో చేసాడు. వారం రోజుల పాటు ఈయనకి సంబందించిన షూటింగ్ చేసారు. ఈ వారం రోజులకు గాను రవితేజ కి నిర్మాతలు 5 వేల రూపాయిలు ఇచ్చారట.
అతి తక్కువ రోజులు పని చేసి, ఎక్కువ డబ్బులు అందుకున్నది రవితేజ ఆ సీరియల్ కోసమేనట. అలాంటి కష్టాలు ఎదురుకొని వచ్చిన ఆయన నేడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. పైకి ఎదగాలి అనే కసి, పట్టుదల మరియు టాలెంట్ ఉంటే ఎంతో గొప్ప స్థాయికి చేరుకుంటారు అనేందుకు రవితేజ అందరికీ ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు.