Bigg Boss Shivaji : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన శివాజీ హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. సుమారుగా 96 చిత్రాల్లో ఆయన నటించాడు. అయితే హీరో గా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పేరు సంపాదించుకున్నాడో, ఎంత అభిమానం ని దక్కించుకున్నాడో అనేది చెప్పలేము కానీ, ఈ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మాత్రం కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
బిగ్ బాస్ అనే పేరు తీస్తే మనకి కొన్ని పేర్లు గుర్తుకు వస్తాయి. అలా శివాజీ పేరు బిగ్ బాస్ హిస్టరీ లో నిలిచిపోతాది. తన మైండ్ గేమ్ తో అద్భుతంగా ఆడుతూ వచ్చిన శివాజీ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు. ఆయనకీ టైటిల్ గెలిచేంత సత్తా మరియు ఫ్యాన్ బేస్ ఉంది, కానీ అతని పల్లవి ప్రశాంత్ గెలుపు కోసం పని చేసాడు కాబట్టి టాప్ 3 దగ్గరే ఆగిపోయాడు.
ఇదంతా పక్కన పెడితే శివాజీ గతం లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఎవరికీ తెలియని కొన్ని సంఘటనలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను హీరో గా కాకుండా మధ్యలో కొన్ని క్యారక్టర్ రోల్స్ చేశాను, అందుకే హీరో గా వేరే లెవెల్ కి వెళ్ళలేకపోయాను అని అనిపిస్తుంది. అప్పట్లో కొన్ని అద్భుతమైన సినిమాలను కూడా వదులుకోవాల్సి వచ్చింది. రవితేజ ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ చిత్రాన్ని ముందుగా నేనే చెయ్యాలి, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమాని వదులుకున్నాను.
ఆ చిత్రం నేను చేసి ఉంటే పెద్ద హిట్ అయ్యేది, నేను పెద్ద స్టార్ హీరోని అయ్యేవాడిని. రవితేజ చెయ్యడం వల్ల ఆ చిత్రం ఫ్లాప్ అయ్యింది, ఎందుకంటే ఆయనకీ మాస్ ఇమేజి ఉంది కాబట్టి’ అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు. అలా ఆయన తన కెరీర్ లో చాలా సినిమాలే వదిలేసుకున్నాడట.