Salaar : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్ ‘ రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ నుండి సరైన బ్లాక్ బస్టర్ కోసం కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు , టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతాయి.
అలాంటిది హిట్ పడితే వేల కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతుందని అభిమానులతో పాటుగా ట్రేడ్ కూడా బలంగా నమ్ముతుంది. వాళ్ళు ఎదురు చూపులకు తెరదించుతూ ‘సలార్’ చిత్రానికి సూపర్ పాజిటివ్ టాక్ రావడం, ఓపెనింగ్స్ ద్వారా మన టాలీవుడ్ సత్తా ఏమిటో ప్రపంచానికి చూపించడం వంటివి జరిగింది. మొదటి రోజు దాదాపుగా 144 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది ఈ చిత్రం.
ఇక రెండవ రోజు తెలంగాణ లో అద్భుతమైన హోల్డ్ ని సాధించినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో మార్నింగ్ షోస్ మరియు మ్యాట్నీ షోస్ కి అత్యధిక ప్రాంతాల్లో డ్రాప్స్ చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. #RRR తర్వాత రెండవ రోజు 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని సాధించిన ఏకైక సినిమాగా ‘సలార్’ నిల్చింది. కానీ హిందీ లో మాత్రం వసూళ్లు ఆశాజనకంగా లేవు.
సినిమా వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా హిందీ లో కనీసం 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని అయినా రాబట్టాలి, కానీ పరిస్థితి చూస్తుంటే వంద కోట్ల రూపాయిల దగ్గరే ఆగిపోయేట్టు ఉంది. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి 210 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. కానీ మూవీ టీం మాత్రం 250 కోట్ల రూపాయిలు వచ్చినట్టుగా చెప్తుంది. ఇక ఈరోజు రేపు కూడా సెలవలు అవ్వడం తో రేపటితో 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని దాటేస్తుంది. ఫుల్ రన్ వెయ్యి కోట్ల టార్గెట్ కి రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కచ్చితంగా వెయ్యి కోట్లు రాబట్టాలి.