Anchor Shiva : ఒక సాధనరాన రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్, అద్భుతంగా గేమ్స్ ఆడి, ప్రవర్తన పరంగా కూడా బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే మంచి వాడు అని నిరూపించుకొని టైటిల్ విన్నర్ గా గెలిచి చరిత్ర తిరగరాసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే బయటకి వచ్చిన తర్వాత అతనికి గెలిచిన ఆనందం లేకుండా పోయింది.
కొన్ని సంఘటనల కారణంగా అతను జైలు కి పోవాల్సి వచ్చింది. రెండు రోజుల పాటు జైలు లో గడిపిన పల్లవి ప్రశాంత్ ని, బిగ్ బాస్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా లోపలకు అడుగుపెట్టి స్పై బ్యాచ్ తో మంచి స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్న భోలే రంగం లోకి దిగి మంచి లాయర్స్ ని ఏర్పాటు చెయ్యడంతో ప్రశాంత్ సురక్షితంగా జైలు నుండి బైలు మీద బయటకి వచ్చాడు.
అయితే ప్రశాంత్ బయటకి వచ్చిన తర్వాత అతను పలువురు యూట్యూబర్స్ తో వ్యవహరించిన తీరు అసలు ఏమాత్రం బాగాలేదని చెప్పాలి. ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి తన ఇంటికి పిలిపించుకొని, గంటలు గంటలు బయట కూర్చోబెట్టి, చివరికి ఇంటర్వ్యూ ఇవ్వను దె***య్ అంటూ బూతులు మాట్లాడాడట. ఈ విషయాన్నీ స్వయంగా యాంకర్ శివ తెలిపాడు. కేవలం యాంకర్ శివ తో మాత్రమే కాకుండా, పలువురి యూట్యూబర్స్ మీద కూడా ప్రశాంత్ విరుచుకుపడ్డాడు అట.
ఈ ధోరణికి నిరసిస్తూ యాంకర్ శివ ప్రశాంత్ మీద కోపం తో ఒక నెగటివ్ వీడియో చేసాడు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. దీనిపై ఫైర్ అయిన పల్లవి ప్రశాంత్ యాంకర్ శివ పై పరువు నష్టం దావా వేస్తానని, నా ఇమేజి మొత్తం డ్యామేజ్ చెయ్యాలని చూశాడని, నేను ఎవరితో అలా దురుసుగా ప్రవర్తించలేదు అంటూ ప్రశాంత్ జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత తన లాయర్స్ తో మాట్లాడాడట. ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.