OTT : విడుదలైన పక్క రోజే ఓటీటీ లోకి ‘సలార్’..నిర్మాతలకు ఇది కోలుకోలేని షాక్!

- Advertisement -

OTT : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ చూసి అటు బాలీవుడ్ నుండి ఖాన్స్, ఇటు కోలీవుడ్ సూపర్ స్టార్స్ అందరూ కూడా నోరెళ్లబెట్టారు. ఇలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో ప్రస్తుతం ఇండియా లోనే లేరని ట్రేడ్ పండితులు సైతం ఒప్పుకునేలా చేసాడు ప్రభాస్.

మొదటి రోజు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 150 నుండి 170 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొడుతుందో లేదో చూడాలి. ఈ సినిమాకి పోటీగా వచ్చిన షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి వసూళ్లు రాబట్టలేకపోతుండడం సలార్ కి బాగా ప్లస్ అయ్యింది.

ఇక ఈ క్రిస్మస్ కి సలార్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ,ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ లీక్ అవ్వడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 60 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అయితే నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని జనవరి 18 వ తేదీన విడుదల చేయాలట.

- Advertisement -

అంటే కనీసం నెల రోజుల సమయం కూడా లేకుండానే ఓటీటీ లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ముందుగానే ఓటీటీ విడుదల తేదీ రావడం వల్ల సినిమాని థియేటర్ లో చూడాలని అనుకున్నవాళ్ళు నెల లోపే ఓటీటీ లోకి వస్తుంది కదా, థియేటర్ కి ఎందుకు వెళ్లడం అని అనుకోవచ్చు. ఇలాంటి లీక్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో కనిపెట్టి తగిన చర్యలు తీసుకుంటామని మేకర్స్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here