Shivaji : బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ గా నిల్చిన పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోస్ లో పోలీస్ నిబంధనలకు విరుద్ధం గా ర్యాలీ చెయ్యడం తో అతన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ సెంట్రల్ జైలు కి తరలించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

కొంతమంది ప్రశాంత్ అరెస్ట్ కి అసంతృప్తి ని వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది అతను చేసిన ఓవర్ యాక్షన్ ఆ మాత్రం శిక్ష పడాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో మొదటి రోజు నుండి పల్లవి ప్రశాంత్ కి అండగా నిలుస్తూ, అతని గెలుపుకు కారణమైన శివాజీ ప్రశాంత్ అరెస్ట్ పై నోరు మెదపకపోవడం పై సోషల్ మీడియా నెటిజెన్స్ పలు రకాలుగా మాట్లాడుకున్నారు.

శివాజీ కామన్ మ్యాన్ కి సపోర్టు చేస్తున్నట్టుగా నటించి టాప్ 5 వరకు వచ్చాడని, ప్రశాంత్ పై ఆయనకీ నిజమైన ప్రేమ ఏమి లేదంటూ పలు రకాల కామెంట్స్ చేసారు. అయితే నేడు సోషల్ మీడియా లో వస్తున్న ఈ నెగటివిటీ ని గమనించి శివాజీ రియాక్ట్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ ‘ప్రశాంత్ అరెస్ట్ అయినా రోజు నుండి ఇప్పటి వరకు ప్రతీ కదలికకు సంబంధించిన సమాచారం ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. అతని తల్లితండ్రులతో నేను కాంటాక్ట్ లోనే ఉన్నాను.
ఇది నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ పై మోపపడిన కేసు నుండి అతను రేపు లేదా ఎల్లుండి, లేకపోతే సోమవారం విముక్తి పొంది విడుదల అవుతాడు. నేను బిగ్ బాస్ హౌస్ లో నాలుగు నెలలు వాడితో కలిసి ఉన్నాను, వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు.. నియమాలను వాడు ఎప్పుడూ అతిక్రమించడు’ అంటూ శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.