Sreeleela : సినిమాల రందిలోపడి ఆ విషయాన్ని గాలికొదిలేస్తున్న శ్రీలీల.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..

- Advertisement -

Sreeleela : టాలీవుడ్ లో ప్రస్తుతం హ్యాపెనింగ్ హీరోయిన్ ఎవరు అని అడిగితే అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు శ్రీ లీల. తెలుగమ్మాయి అయినా కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ భామ ముందుగా కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ అయింది. తెలుగులో పెళ్లి సందడి అనే సినిమాతో హీరోయిన్గా మారిన ఆమె ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేస్తూ వెళుతోంది. అసలు ఏమాత్రం ఖాళీ లేకుండా బిజీబిజీగా షూటింగ్స్ లో పాల్గొనే ఆమె ప్రస్తుతం ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతోంది.

ఆమెకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి పరీక్షలు రాయడానికి వెళ్ళిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ కోసం ఆమె ఇప్పుడు పరీక్షలకు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్న దర్శకనిర్మాతలు ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుతున్నారు.

కొద్ది రోజుల నుంచి హీరో హీరోయిన్ల మధ్య డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు శ్రీ లీల పరీక్షలు రాయడానికి వెళ్లడంతో అవి పెండింగ్లో పడతాయని భావించిన సినిమా యూనిట్ శ్రీ లీలను సంప్రదించిందట. అయితే సినిమా కోసం పరీక్షలు త్యాగం చేసిన ఆమె తాను సప్లమెంటరీలో అయినా పరీక్షలు రాసుకుంటానని నిర్మాతలకు ఇబ్బంది కలిగితే తాను తట్టుకోలేని చెప్పి వెనక్కి తిరిగి వచ్చి షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ మీద కొన్ని డ్యాన్స్ సీక్వెన్స్ షూట్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here