Devil Review : నందమూరి ఫ్యామిలీ నుండి మాస్ మరియు కమర్షియల్ మూవీస్ కి బిన్నంగా, సరికొత్త కథలను ఎంచుకొని, ఆడియన్స్ కి అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలని చూసే హీరోలలో ఒకడు కళ్యాణ్ రామ్. అలాంటి సినిమాలు కెరీర్ లో చాలా తీసాడు కూడా. కానీ ఎక్కువ శాతం ఫ్లాప్స్ అయ్యాయి. తన ప్రతీ సినిమాతో కొత్త డైరెక్టర్ ని పరిచయం చేసే కళ్యాణ్ రామ్, ఇప్పటి వరకు సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి మరియు రీసెంట్ గా వసిష్ఠ వంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.

ఇప్పుడు వాళ్లంతా ఏ రేంజ్ లో ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే అమిగోస్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న చిత్రం ‘డెవిల్’. ఈ సినిమా ఈ నెల 29 వ తారీఖున విడుదలకు సిద్ధం గా ఉంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

నిన్ననే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ని ఇచ్చారు. సినిమా రన్ టైం రెండు గంటల 26 నిమిషాలు ఉంటుందట. ఫస్ట్ హాఫ్ మొత్తం పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో థియేటర్స్ లో కూర్చున్న ప్రేక్షకుగాను సర్ప్రైజ్ కి గురి చేస్తుందట. ణ్ రామ్ కెరీర్ లోనే ది బెస్ట్ సెకండ్ హాఫ్ అని అంటున్నారు.

ఇందులో కళ్యాణ్ రామ్ సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ గా నటించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, మాళవిక నాయర్ ముఖ్య పాత్ర పోషించింది. సలార్ లాంటి డైనోసార్ తో పోటీకి దిగుతుంది అంటే ఈ చిత్రం మీద నిర్మాత కళ్యాణ్ రామ్ కి ఏ రేంజ్ నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు, మరి ఆ నమ్మకం ని ‘డెవిల్’ నిలబెడుతుందో లేదో చూడాలి.