Pawan Kalyan : ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క క్రియాశీలక రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల తర్వాత వరుసగా మూడు సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ‘ఓజీ’ మరియు ‘హరిహరవీరమల్లు’ చిత్రాలు 70 శాతం కి పైగా షూటింగ్స్ ని పూర్తి చేసుకోగా, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం 40 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది.
మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా, ప్రస్తుతానికి సినిమా షూటింగ్స్ మొత్తం హోల్డ్ లో పెట్టేసాడు పవన్ కళ్యాణ్. ఎన్నికలు పూర్తి అవ్వగానే షూటింగ్స్ ని తిరిగి ప్రారంభిస్తాడు. అన్నిటికంటే ముందుగా ‘ఓజీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది.
అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆయనకీ చిన్నప్పటి నుండి ఆస్తమా సమస్య ఉంది. అందుకే ఆయన రాజకీయాల్లోకి ఉన్నప్పటికీ పాదయాత్ర వంటివి చెయ్యడు. అంతే కాకుండా తీవ్రమైన ఒత్తిడి కి గురి అయ్యినప్పుడు పవన్ కళ్యాణ్ స్పృహ కోల్పోయి క్రింద పడిపోవడం వంటివి గతం లో చాలాసార్లు జరిగాయి.
మంచి నీళ్లు మార్చినా కూడా ఆయనకీ వైరల్ ఫీవర్ వచ్చేస్తుంది. ఇలా తరుచు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఇచ్చిన సూచనల ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రతీ రోజు అర్థరాత్రి పవన్ కళ్యాణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చెయ్యిస్తున్నాడని, తన ఫామ్ హౌస్ లో తన సతీమణి అన్నా లెజినావా తో కలిసి ఆయన ఈ పూజలు చేస్తున్నాడు అట. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.