Prabhas : ‘సలార్’ క్లైమాక్స్ లో ‘బాహుబలి’ కి మించిన ట్విస్ట్..పార్ట్ 2 కోసం అదిరిపోయే ఎండింగ్!

- Advertisement -

Prabhas : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన సలార్ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మితి మీరిన అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తూ ఉంటే మొదటి రోజే ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

మొదటి రోజు 200 కోట్ల రూపాయిల గ్రాస్ అంటే మన స్టార్ హీరోల ఫుల్ రన్ కలెక్షన్స్ తో సమానం అన్నమాట. ప్రభాస్ సూపర్ స్టార్ స్టేటస్ ఏ రేంజ్ లో ఉంది అనేది దీనిని చూసి చెప్పొచ్చు. మూడు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్స్ గా నిలుస్తూ వచ్చినా కూడా ప్రభాస్ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో ప్రశాంత్ నీల్ అభిమానుల్లో ఉన్న అనుమానాలకు ఒక క్లారిటీ ఇచ్చాడు.

చాలా కాలం నుండి సోషల్ మీడియా లో నీల్ సినిమాటిక్ యూనివర్స్ పేరిట కేజీఎఫ్ చిత్రానికి మరియు సలార్ చిత్రానికి లింక్స్ ఉన్నట్టు చెప్పుకొచ్చారు. దీనిపై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ కేజీఎఫ్ కి సలార్ కి అసలు సంబంధమే లేదు, ఈమధ్య లోకేష్ కనకరాజ్ తన సినిమాలకు ఇలా లింక్స్ పెడుతున్నాడు, నాకు అంత టాలెంట్ లేదు అని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూ కి రాజమౌళి యాంకర్ గా వ్యవహరించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

- Advertisement -

ఇంకా అయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో జనాలు ఊహించని సర్ప్రైజ్ ఏమైనా ఉంటుందా’ అని అడగగా, దానికి ప్రశాంత్ నీల్ సమాధానం చెప్తూ ‘ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ క్లైమాక్స్ లో ఉంటుంది. ఆ ట్విస్ట్ పార్ట్ 2 పై అంచనాలను పెంచేలా చేస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ కేజీఎఫ్ తో లింక్ లేదని చెప్పేసాడు, మరి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ ట్విస్ట్ ఏముంటుంది? అని ఆలోచిస్తున్నారు. దానికి సమాధానం దొరకాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here