Hanuman Trailer : సంక్రాంతి వచ్చిందంటే చాలు సినీ అభిమానులకు పండగే. వరుసగా రెండు మూడు సినిమాలు ఉంటాయి, ఏ సినిమాని ముందుగా చూడాలో అర్థం కాదు కానీ, ప్రతీ సినిమాని చూస్తారు. అందుకే దర్శక నిర్మాతలు సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేసుకోవడానికి పోటీ పడుతూ ఉంటారు. ఈ సంక్రాంతికి కేవలం రెండు మూడు సినిమాలు కాదు, అరడజను సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.

వాటిల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం తర్వాత ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జల హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి టీజర్ నుండే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి అయితే మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంత తక్కువ బడ్జెట్ తో ఇంత క్వాలిటీ గా ఎలా తీశారు అని ఆశ్చర్యపోయారు అందరూ.

ఈ ట్రైలర్ లో ఉన్న షాట్స్ మొత్తం ఒక ఎత్తు అయితే, చివరి షాట్ మరో ఎత్తు. హిమాలయాల్లో మంచు కొండల్లో ధ్యానం చేసుకుంటున్న ఆంజనేయస్వామి, ఒక్కసారిగా కళ్ళు తెరిచి పైకి లేచే షాట్ అందరి మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేసింది. ఈ కళ్ళని బాగా గమనిస్తే అది మెగాస్టార్ చిరంజీవి కళ్ళు లాగ అనిపిస్తుంది.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఏమైంది దాచిపెట్టాడా?, ఈ చిత్రం లో చిరంజీవి హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడా? , ఇలాంటి సందేహాలు అభిమానుల్లో మెలుగుతున్నాయి. ఆయన ఈ సినిమాలో ఉన్నాడో లేదో తెలియదు కానీ, కళ్ళు మాత్రం చూస్తుంటే చిరంజీవి కళ్ళు లాగానే ఉన్నాయి. ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు కాబట్టి మెగాస్టార్ ని అడిగిన వెంటనే ఒప్పుకొని ఉంటాడు అని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి మరి.