Allari Naresh : సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలే రాజ్యమేలుతున్న తరుణంలో అల్లరి నరేష్ ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేష్ ట్రెండ్ సెట్టర్ కమెడియన్ గా మారిపోయారు. కామెడీని నమ్ముకుని స్టార్ హీరోగా ఎదిగి ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కూడా వసూళ్లు చేయలేని కలెక్షన్లను తన సినిమా ద్వారా వసూలు చేసి తనేంటో నిరూపించుకున్నాడు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు.. అల్లరి నరేష్ సినిమా వస్తోంది అంటే 50శాతం మంది అల్లరి నరేష్ సినిమానే ఇష్టపడేవారు.

ముఖ్యంగా అతని కామెడీ టైమింగ్‌ని ప్రజలు ఇష్టపడుతారు. కామెడీ టైమింగ్ కాకుండా కంటెంట్ ఉన్న పాత్రలను చూస్ చేసుకోవడంతో ఆయన ఫేమ్ మారిపోయింది తప్పిస్తే అల్లరి నరేష్ లో ఆ టాలెంట్ మాత్రం అలాగే ఉంది. అల్లరి నరేష్ తెరపై చాలా తక్కువగా మాట్లాడుతాడు. ఆయన పని ఆయన చూసుకొని వెళ్లిపోతుంటారు. కాంట్రవర్షియల్ విషయాల్లో అస్సలు తల దూర్చాడు . కానీ అల్లరి నరేష్ ఓ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించాడు అని.. ఆమె కూడా అతడిని ప్రేమించింది అన్నట్లు నమ్మించి మోసం చేసింది అన్న న్యూస్ అప్పట్లో చర్చనీయాంశం అయింది.

అల్లరి నరేష్ చాలా మంచివాడు.. ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తాడు. అలాగే ఓ హీరోయిన్ ని గుడ్డిగా ప్రేమించి ఆమె మోసాలకు బలి అయ్యాడనే వార్త హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అల్లరి నరేష్ ని ప్రేమించానని చెప్పి మోసం చేసిన హీరోయిన్.. మరో స్టార్ హీరోని పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే అల్లరి నరేష్ ముద్దుల హీరోయిన్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోకి భార్య. దీని గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అనే వార్తలు వినిపిస్తున్నాయి.