Upasana Konidela : సినిమా అన్న తర్వాత హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అత్యవసరం. ఆ కెమిస్ట్రీ కొంతమంది హీరోలకు అప్పటికప్పుడు రావు. కాబట్టి పని చేసే హీరోయిన్స్ తో క్లోజ్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి ఇలా చేసేవాడిని అని పలు ఇంటర్వ్యూస్ లో స్వయంగా ఆయనే తెలిపాడు. కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కాదు, సినిమాలో పని చేసే ప్రతీ ఒక్క నటుడితో స్నేహం చెయ్యడం అత్యవసరం. అప్పుడే ఆన్ స్క్రీన్ మీద ఔట్పుట్ కూడా బాగా వస్తుంది.
అలా రామ్ చరణ్ కూడా అదే పాటించేవాడట. తన తోటి హీరోయిన్స్ తో స్నేహ పూర్వకంగా మెలగడం, వాళ్ళతో చనువు గా ఉండడం వంటివి చేసేవాడు. అలా ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ సమయం లో సమంత తో కూడా అంతే స్నేహపూర్వక వాతావరణం ని మైంటైన్ చేసాడు. అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన కి తనతో తప్ప ఏ అమ్మాయితో అయినా రామ్ చరణ్ క్లోజ్ గా ఉండడం అసలు ఇష్టం ఉండదు.
ఈ విషయాన్నీ ఆమెనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. కైరా అద్వానీ రామ్ చరణ్ తో క్లోజ్ గా ఉన్నప్పుడు కూడా కైరా కి చాలా స్మూత్ గా వార్నింగ్ ఇచ్చేది అట. ఇకపోతే సమంత రంగస్థలం చిత్రం లో రామ్ చరణ్ కి లిప్ కిస్ ఇచ్చే సన్నివేశం ఉపాసన ని చాలా డిస్టర్బ్ చేసిందట. ఈ విషయం లో రామ్ చరణ్ తో గొడవకి కూడా దిగింది అట అప్పట్లో. అయితే రామ్ చరణ్ ఉపాసన కూల్ అయ్యే విధంగా మాట్లాడడం తో సర్దుకుంది.
కానీ ఆమెకి సమంత మీద కోపం మాత్రం తగ్గలేదు. ఆ కోపం లో ఆమె సమంత ఫోన్ నెంబర్ ని బ్లాక్ లో పెట్టేసిందట. అప్పటి నుండి ఇప్పటి వరకు సమంత నెంబర్ ని తన ఫోన్ లో అన్ బ్లాక్ చెయ్యకుండా అలాగే ఉంచేసిందట. ఉపాసన సంగతి తెలిసే రామ్ చరణ్ అప్పటి నుండి లిప్ లాక్ సన్నివేశాలకు నో చెప్తూ వస్తున్నాడట.