Pallavi Prashanth : బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా ఎన్నడూ లేని విధంగా పల్లవి ప్రశాంత్ అనే సామాన్యపు రైతు బిడ్డ గెలిచాడు. అతను గెలిచినందుకు చాలా మంది ఎంతో సంతోషించారు. కానీ గెలిచి బయటకి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ మరియు అతని అభిమానులు చేసిన కొన్ని దుశ్చర్యలు ఇన్ని రోజులు అతనికి ఓట్లు వేసి గెలిపించిన వారికి కూడా సిగ్గు తో తల దించుకునేలా చేసింది.

ఈ సీజన్ రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వస్తున్న సమయం లో పల్లవి ప్రశాంత్ అభిమానులు అతని కారు మీద ఎక్కి, వెనుక గ్లాస్ ని బద్దలు కొట్టి, కార్ లో ఉన్న అతని అమ్మ, భార్య ని కూడా భయానక పరిస్థితికి గురి అయ్యేలా చేసారు. ఇంత క్రూరం గా బిగ్ బాస్ చరిత్ర లో ఏ కంటెస్టెంట్ అభిమానులు కూడా చెయ్యలేదని చెప్పొచ్చు.

ఇక పోలీసుల నిబంధనలకు విరుద్ధం గా వ్యవహరించి పల్లవి ప్రశాంత్ మరియు అతని తమ్ముడు ర్యాలీలు చెయ్యడం, అభిమానులను రెచ్చగొట్టే చర్యలు చెయ్యడం వల్ల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఎంతో ఇబ్బంది పడ్డారు. వారి కార్లు ద్వంసం అయ్యాయి. అశ్వినీ, గీతూ రాయల్ మొదలగు లేడీ కంటెస్టెంట్స్ ర్యాగింగ్ చేసారు. పాపం అశ్వినీ అయితే మమల్ని వదిలేయండి అంటూ ఏడ్చింది కూడా. వీటి అన్నిటికీ కారణం పల్లవి ప్రశాంత్ అని పోలీసులు బలంగా నమ్ముతున్నారు.

ఈ సంఘటనలో పల్లవి ప్రశాంత్ తమ్ముడు మనోహర్ ని A2 ముద్దాయిగా , అతని స్నేహితుడిని A3 ముద్దాయిగా పరిగణించి అరెస్ట్ చేసారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కోసం పోలీసులు వెళ్తుండగా అతను వేరే చోట ఉన్నాడని తెలిసింది. ఆయన రాగానే అరెస్ట్ చెయ్యడానికి పోలీసులు సిద్ధం గా ఉన్నారు. జరిగిన ఈ సంఘటనలకు పల్లవి ప్రశాంత్ పోలీసుల ముందు ఏమని సమాధానం చెప్తాడో చూడాలి. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ ని A1 ముద్దాయిగా పోలీసులు పరిగణించారు.
