Trisha : అడిగినంత ఇవ్వకపోవడంతో ఆ నిర్మాతలకి నో చెప్పిన త్రిష

- Advertisement -

Trisha : పొన్నియన్ సెల్వన్ విజయంతో త్రిష మళ్లీ జోరు అందుకుంది. ఈ సినిమా రెండు పార్ట్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక తర్వాత తలపతి విజయ్ సరసన త్రిష చేసిన లియో సినిమా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దీంతో త్రిష తన రెమ్యూనరేషన్‌ను కూడా పెంచేసింది. ఇంతలో డైరెక్టర్ మణిరత్నం నెక్స్ట్ సినిమా ‘థగ్ లైఫ్’లో కూడా త్రిష ఛాన్స్ కొట్టేసింది. ఇందులో కమల్ హాసన్ సరసన త్రిష నటించబోతుంది.

ఇలా వరుస సినిమాలతో త్రిష బిజీబిజీగా ఉంది. ఆమె క్రేజ్‌ని చూసి కొందరు తెలుగు నిర్మాతలు సీనియర్ హీరోల సినిమాల్లో త్రిషని హీరోయిన్‌గా నటించమని సంప్రదించారట. అయితే త్రిష చెప్పిన రెమ్యూనరేషన్ విని నిర్మాతలు కళ్లు తేలేశారట. త్రిష నాలుగు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అడిగినట్లు సమాచారం. ఈ మాట వినగానే ప్రొడ్యూసర్లు జేబులో చేతులు పెట్టుకొని బయటికి వచ్చేశారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here