Pooja Hegde .. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని బుట్ట బొమ్మగా ఏలేసింది.. తన అందచందాలతో చక్రం తిప్పేసింది. కాలు కింద పెట్టకుండా అటు నుంచి ఇటు తిరగాలన్న కార్లలోనే ప్రయాణిస్తూ తన యవారం సాగించుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఆమెను పట్టించుకున్న దాఖలాల్లేవు. పూజ హెగ్డే ఎంత విప్పుకుని హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసిన.. బయట కనిపించిన జనాలు ఆమెను పట్టించుకోవడం లేదు. దానికి కారణం అమ్మడు క్రేజ్ తగ్గిపోవడమే. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాల్లో నటించడంతో తనను పట్టించుకోవడం మానేశారు.

అంతేకాదు ఆఖరికి ఆమె తెలుగులో ఫేవరెట్ అనుకున్న హీరో కూడా తనను ఖాతరు చేయడం లేదు. ఒకప్పుడు తెలుగులో ఈ హీరో పూజ హెగ్డే చుట్టే తిరిగేవాడు. మరీ ముఖ్యంగా ఆమెను తన ఫంక్షన్స్ లో ఓ రేంజ్ లో పొగిడేవాడు. అయితే పూజా హెగ్డే క్రేజ్, కెరీర్ గ్రాఫ్ ఎప్పుడైతే పడిపోయిందో అప్పటినుంచి ఆయన ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఆయనపై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ ఫ్రెండ్స్ వద్ద ఆవేదన వ్యక్తం చేసిందట.

ఇటీవల బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్దే మాట్లాడుతూ తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరనే విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో పూజా హెగ్డే పరోక్షంగా ఆ హీరోను పేరు ప్రస్తావించకుండా అలాంటి హీరోలంటే తనకు అసహ్యం అని చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతుంది..!!