బిగ్ బాస్ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ఒక కామన్ మెన్, రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాలి అనే కసితో అడుగుపెట్టి, ఆ తర్వాత అద్భుతంగా టాస్కులు ఆడుతూ, తన మంచి ప్రవర్తన తో కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. అంత మంది సినీ సెలబ్రిటీస్ మధ్య పల్లవి ప్రశాంత్ సామాన్యుడిగా ఎంటర్ అయ్యి టైటిల్ ని గెలుచుకోవడం అనేది ఒక చరిత్ర.
ఇక పోతే అతని బిగ్ బాస్ జర్నీ ఈ స్థాయి లో సాఫీగా జరగడానికి కారణం శివాజీ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తలో కంటెస్టెంట్స్ అందరూ ప్రశాంత్ పై టార్గెట్ చెయ్యడం ప్రారంభించారు. అలాంటి సమయం ప్రశాంత్ వెనుక ఒక శక్తి లాగ నిలబడి శివాజీ అండగా నిలిచాడు. చివరి వరకు ప్రశాంత్ ని తప్పటడుగులు వెయ్యకుండా కాపాడాడు.
ప్రశాంత్ ని హౌస్ మేట్స్ ఎంత తక్కువ చూపు చూసి, ఎంత టార్గెట్ చేస్తే అంత ఫాలోయింగ్ ఆయాకి రోజురోజుకి పెరుగుతూ పోయింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు మొత్తం ప్రశాంత్ కి అండగా నిలిచారు. అతనికి సపోర్టు చేస్తూ ఓట్లు వేసి గెలిపించారు. కేవలం రైతు బిడ్డ ట్యాగ్ తో సానుభూతి పొందాలని ప్రశాంత్ ఎప్పుడూ అనుకోలేదు. ప్రతీ టాస్కు లో అతని చూపించిన దూకుడు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది.
కొన్ని టాస్కులు అతను ఆడే విధానం చూస్తే ఇతన్ని ఒలంపిక్స్ కి పంపితే ఇండియా కి ఎదో ఒక మెడల్ ని పట్టుకొస్తాడు అని అనిపించేలా ఆడాడు. ఇవన్నీ పక్కన పెడితే తాను గెలిచినా 35 లక్షల రూపాయిలను ఆపదలో ఉన్న రైతుకి ఉపయోగిస్తాను అంటూ ఆయన చేసిన వాగ్దానం ని మర్చిపోలేదు. టైటిల్ ని గెలిచిన తర్వాత కూడా ఆయన ఇదే మాట మీద ఉన్నాడు. ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చిన పల్లవి ప్రశాంత్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం.