Bigg Boss : రైతుబిడ్డగా ‘బిగ్ బాస్ సీజన్ 7’లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. అసలు తను ఈ షోలోకి ఎంటర్ అయినప్పుడు తను ఎవరు, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఎలా ఆడతాడు అని ప్రేక్షకులంతా అనుకున్నారు. కానీ బరిలోకి దిగిన తర్వాత శారీరికంగానే కాదు.. మానసికంగా కూడా పల్లవి ప్రశాంత్ అంటే ఏంటో అందరికీ తెలిసింది. ఎవరికి తెలియని వ్యక్తి నుంచి ఇప్పుడు ‘బిగ్ బాస్ సీజన్ 7’ ట్రోఫీకి చేరువలో ఉన్నాడు ప్రశాంత్. ఇక తన గురువు శివాజీని దాటి టైటిల్ విన్నర్ అవ్వడం మాత్రమే మిగిలింది. బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చాక ఈ రైతు బిడ్డకు శివాజీ దగ్గరయ్యాడు.
ప్రతీ విషయంలో ప్రశాంత్‌ను ముందుండి నడిపిస్తూ ఉండేవాడు. ప్రశాంత్ ఏం చేసినా.. దాని వెనుక శివాజీ ప్రభావం ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ ఎవరు ఎంత ఎంకరేజ్ చేసినా.. ఆట అనేది కంటెస్టెంట్ చేతిలోనే ఉంటుంది కదా.. అందుకే టాస్కుల విషయంలో అందరికీ గట్టి పోటీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. పట్టుదలతో ఆడాలన్నా, గేమ్‌పై ఫోకస్ పెట్టాలన్న ప్రశాంత్ ముందుంటాడు అని అందరూ అనుకున్నారు. కంటెస్టెంట్స్ సైతం ప్రశాంత్‌కు గేమ్‌పై ఫోకస్ ఎక్కువ అని ప్రశంసించారు.
అదే ఫోకస్‌తో ‘బిగ్ బాస్ సీజన్ 7’లో కెప్టెన్ అయ్యాడు, పవర్ అస్త్రా సాధించుకున్నాడు. పల్లవి ప్రశాంత్‌కు గేమ్ ఎలా ఆడాలో తెలుసు, ఎటూ డైవర్ట్ అవ్వకుండా ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలో తెలుసు అని ప్రేక్షకులు అనుకునేలా చేశాడు. అందుకే తన పట్టుదల చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యి.. తనకే ఓట్లు వేయడం మొదలుపెట్టారు. టాస్కుల్లో బలమైన గాయాలైనా సరే తగ్గేదేలే అంటూ ముందుకు సాగాడు ప్రశాంత్. ఇవ్వన్నీ చూస్తే పల్లవి ప్రశాంత్ కు టైటిల్ రావడం కచ్చితం అనిపిస్తుంది.