Charmy Kaur : ఆ హీరోకి పెళ్లి అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ హీరోయిన్ చార్మీ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Charmy Kaur : టాలీవుడ్ లో అందం తో పాటుగా యాక్టింగ్ టాలెంట్ కూడా ఉన్న అతి తక్కువ మంది టాప్ హీరోయిన్స్ లో ఒకరు చార్మీ. కెరీర్ ప్రారంభం నుండే ఈమె నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎక్కువగా చేస్తూ వచ్చింది. అదే సమయం లో అందాలు ఆరబొయ్యడంలో ఈమెకి మించి హీరోయిన్ కూడా మరొకరు లేదు. సీనియర్ హీరోల దగ్గర నుండి, యంగ్ హీరోలు మరియు నేటి తరం స్టార్ హీరోయిన్ల వరకు ఈమె ప్రతీ ఒక్కరితో కలిసి నటించింది.

Charmy Kaur

ఇప్పుడు ఆమె నటనకి దూరం గా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి వరుసగా సినిమాలను నిర్మిస్తుంది. వీళ్లిద్దరు కలిసి నిర్మిస్తున్న సినిమాలు అధిక శాతం అట్టర్ ఫ్లాప్స్ గానే నిలిచాయి. హీరో రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఒక్కటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు.

Charmy Kaur Photos

ఇకపోతే చార్మీ అప్పట్లో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో ప్రేమాయణం నడిపిందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ మీడియా లో ఒక వార్త ప్రచారమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, మళ్ళీ ఆ ప్రస్తావన రాలేదు. పూరి జగన్నాథ్ కూడా ఆమె చాలా కాలం డేటింగ్ చేసింది అంటూ వార్తలొచ్చాయి.

- Advertisement -
Charmy Kaur Stills

కానీ అందులో కూడా ఎలాంటి నిజం లేదని చార్మీ రీసెంట్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. లేటెస్ట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ‘నాకు హ్రితిక్ రోషన్ అంటే చాలా ఇష్టం..అతన్ని తల్చుకుంటే నాకు రాత్రులు నిద్ర కూడా పట్టదు, అతనికి అప్పట్లో పెళ్లి అయ్యిందని చాలా బాధ పడ్డాను. ఇప్పుడు విడిపోయి సింగిల్ గా ఉంటున్నాడు కదా.. మళ్ళీ ఆయనకీ పెళ్లి అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను’ అంటూ చార్మీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here