Maharshi Movie : ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానం లో నిలుస్తాడు. కెరీర్ ప్రారంభం నుండి ఆయన తీసిన సినిమాలన్నీ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తీసినవే. రీసెంట్ సమయం లో ఆయన ఎక్కువగా మెసేజి ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నాడు.
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానం లో నిలుస్తాడు. కెరీర్ ప్రారంభం నుండి ఆయన తీసిన సినిమాలన్నీ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తీసినవే. రీసెంట్ సమయం లో ఆయన ఎక్కువగా మెసేజి ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నాడు.
ఇది ఆయన అభిమానులకు పెద్దగా నచ్చకపోవచ్చు కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ లో మాత్రం మహేష్ బాబు ఈ మెసేజి సినిమాల ద్వారా ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు అనే చెప్పాలి. అందుకే ఆయన రీసెంట్ చిత్రాలకు పెద్దగా టాక్ లేకపోయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేసాయి. ‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత మహేష్ కి ఎంతో గొప్ప పేరు ని తెచ్చిపెట్టిన సినిమా ‘మహర్షి ‘. చక్కటి మెసేజి తో కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి తీసిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో బెస్ట్ లాంగ్ రన్ వచ్చిన సినిమాలలో ఒకటిగా నిల్చింది.
ఈ సినిమా అప్పట్లో దాదాపుగా 105 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్ గా నిల్చిందో, టీవీ టెలికాస్ట్ లో కూడా అదే స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. మొదటిసారి టెలికాస్ట్ అయ్యినప్పుడు కేవలం 9 టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. కానీ రిపీట్ టెలికాస్ట్ లో కూడా అదే స్థాయి రేటింగ్స్ వచ్చాయి. ఎప్పటికీ కూడా ఈ సినిమాని జెమినీ టీవీ లో వీకెండ్స్ టెలికాస్ట్ చేస్తే 5 రేటింగ్స్ కి తగ్గకుండా వస్తున్నాయి.
జెమినీ లో కొత్త సినిమాలకు కూడా ఈమధ్య ఆ స్థాయి రేటింగ్స్ రావడం లేదు. అలాంటిది ‘మహర్షి’ కి ఇప్పటికీ వస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా టీవీ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది అనేది. అందుతున్న సమాచారం ప్రకారం కేవలం టీవీ టెలికాస్ట్ ద్వారానే ఈ సినిమా ద్వారా జెమినీ టీవీ కి 100 కోట్ల రూపాయిల ఆదాయం వచ్చిందట. ఇది ఆల్ టైం రికార్డు అని అంటున్నారు.