Tripti Dimri ని దారుణంగా మోసం చేసిన నిర్మాత.. ‘యానిమల్’లో సె*క్స్ సీన్ చేసినా డబ్బులు ఇవ్వలేదుట..!

- Advertisement -

Tripti Dimri : రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’లో తృప్తి మెయిన్ హీరోయిన్ కాదు. అందులో తను సెకండ్ హీరోయిన్ పాత్రలోనే కనిపించింది. కానీ మెయిన్ హీరోయిన్‌గా నటించిన రష్మిక కంటే తృప్తి గురించే ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక మూవీ విడుదలయిన ఇన్నాళ్లకు అసలు ఈ సినిమా కోసం తను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే విషయం బయటికొచ్చింది. ‘యానిమల్’ సినిమా చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు తృప్తిని ‘భాబీ 2’ అని పిలవడం మొదలుపెట్టారు.

Tripti Dimri
Tripti Dimri

సినిమాలో తను పోషించిన జోయా అనే పాత్రకంటే భాబీ 2గానే ఫేమస్ అయ్యింది. తను ఇప్పటివరకు పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా కూడా ‘యానిమల్’ వల్ల తనకు వచ్చినంత గుర్తింపు మునుపటి సినిమాల వల్ల రాలేదు. అందుకే ఈ మూవీలో నటించడం కోసం తృప్తి రెమ్యునరేషన్ చాలా తక్కువ అని సమాచారం. ‘యానిమల్’లో జోయా పాత్ర కోసం తృప్తి కేవలం రూ.40 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్‌గా అందుకుందట. రెమ్యునరేషన్ తక్కువే అయినా ‘యానిమల్’ సినిమా తృప్తి కెరీర్‌కు చాలా ప్లస్ అయ్యింది.

Ranbir Kapoor

బాలీవుడ్ నుంచి మాత్రమే కాదు.. టాలీవుడ్ నుంచి కూడా తనకు ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటివరకు తనెవరో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా.. ఇప్పుడు ఏకంగా ఐఎమ్‌డీబీ పాపులర్ సెలబ్రిటీల లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. బాలీవుడ్ స్టార్ల వారసులు అయిన సుహానా ఖాన్, ఖుషీ కపూర్‌ను కూడా తను వెనక్కి నెట్టేసింది. అంతే కాకుండా మరెందరో సీనియర్ సెలబ్రిటీలు కూడా ఈ లిస్ట్‌లో తృప్తి తరువాత స్థానాల్లోనే ఉన్నారు. దీంతో ఒక్క సినిమా, ఒక్క పాత్ర.. తృప్తి కెరీర్‌ను ఎంతగా మార్చేసింది అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here