Priyanka Jain : ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ‘స్పై’ మరియు ‘స్పా’ గ్రూప్స్ గా విడిపోయి మొదటి వారం నుండి చివరి వారం వరకు ఆడిన సంగతి మన అందరికీ తెలిసిందే. స్పై గ్రూప్ లో శివాజీ, ప్రశాంత్ మరియు యావర్ ఉండగా స్పా గ్రూప్ లో శోభా శెట్టి, ప్రియాంక మరియు అమర్ దీప్ ఉన్నారు. ఈ రెండు గ్రూప్స్ మధ్య స్నేహం అద్భుతంగా పండింది. అందుకే ఈ సీజన్ అంత పెద్ద హిట్ అయ్యింది.
అయితే స్పై గ్రూప్ లో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినప్పటికీ వెంటనే కలిసిపోయేవారు. కానీ స్పా గ్రూప్ లో గొడవలు అప్పుడప్పుడు చాలా పెద్దగానే జరిగాయి. ఎంత పెద్ద గొడవలు జరిగినా వీళ్ళు కూడా వెంటనే కలిసిపోయేవారు కానీ, వీళ్ళ మధ్య జరిగిన గొడవలు బయట చూసే ఆ కంటెస్టెంట్స్ కుటుంబ సబ్యులకు చాలా ఇబ్బంది కలిగించింది.
ఉదారణకి టికెట్ తో ఫినాలే టాస్కు లోని బాల్స్ రౌండ్ లో ప్రియాంక మరియు అమర్ దీప్ మధ్య జరిగిన చిన్న గొడవ సోషల్ మీడియా లో పెను దుమారమే రేపింది. ప్రియాంక నుండి బాల్ తీసుకునే క్రమం లో అమర్ దీప్ ప్రియాంక ని క్రింద పడేసి, పైకి లేపి, ఇష్టమొచ్చినట్టు ఈడ్చి పారేసి, బాల్ ని సొంతం చేసుకుంటాడు. ఇది బయట చూసిన ప్రేక్షకులకు చాలా రాక్షసంగా అనిపించింది. అమర్ పై నెగటివిటీ ని కూడా పెంచింది.
దీనిపై ప్రియాంక కాబొయ్యే భర్త శివ్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘ ప్రియాంక ని బాల్స్ టాస్క్ లో అమర్ ప్రవర్తించిన తీరు నాకు చాలా కోపం తెప్పించింది. ఎవరికైనా ఇష్టమైన వాళ్ళని అలా బాధకి గురి చేస్తే కోపం వస్తుంది కదా, నాకు కూడా అంతే కోపం వచ్చింది. అమర్ గారు ప్రియాంక కి గొప్ప స్నేహితుడు అని చెప్తూ ఉంటాడు కదా, ఆ స్నేహం అక్కడ ఏమైంది?, కేవలం 40 పాయింట్స్ కోసం అంతలా హింస పెట్టాలా?. ఈ విషయం లో మాత్రం నాకు అమర్ గారిని కొట్టేంత కోపం వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు.