మెగాస్టార్ Chiranjeevi పాత సినిమాలను ఒక్కసారి చూస్తే ఇప్పుడు వస్తున్నా కేజీఎఫ్ , ఎనిమల్ వంటి సినిమాలు అప్పట్లో ఆయన చేసేసాడు అనిపిస్తాది. ఆ రేంజ్ సినిమాలు చేసాడు కాబట్టే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయిలో ఉన్నాడు అనేది కుర్ర డైరెక్టర్స్ అభిప్రాయం కూడా. అలా చిరంజీవి సినిమాలను ఆధారంగా తీసుకొని కొంతమంది కొత్త డైరెక్టర్స్ నేటి తరం యువతకి నచ్చే విధంగా తెరకెక్కిస్తున్నారు. అలాంటి చిత్రాలలో ఒకటి ‘సెట్ రౌడీ’.

అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఈ సినిమా బాగానే ఆడింది కానీ, ఆయన రేంజ్ హిట్ కాదనే చెప్పాలి. ఈ సినిమాలో చిరంజీవి మొదటి నుండి ప్రీ క్లైమాక్స్ వరకు రౌడీ గానే కనిపిస్తాడు, కానీ క్లైమాక్స్ లో తెలుస్తాది, అతను ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని. ఈ కాన్సెప్ట్ ని తీసుకొని, తనదైన స్టైల్ లో హీరో క్యారక్టర్ రాసుకొని పూరి జగన్నాథ్ ‘పోకిరి’ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు.

మహేష్ బాబు హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం 2006 వ సంవత్సరం లో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆరోజుల్లోనే 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో మహేష్ బాబు ప్రీ క్లైమాక్స్ వరకు అల్లరి చిల్లర తిరిగే పాత బస్తీ రౌడీ కుర్రాడిగా కనిపిస్తాడు. రెండు గ్యాంగ్స్ మధ్య చేరి అందరిని చంపేస్తూ ప్రీ క్లైమాక్స్ లో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ చేస్తాడు.

ఈ ఎలిమెంట్ సినిమాని మామూలు స్థాయి నుండి మరోస్థాయికి తీసుకెళ్లింది. అలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోని యావరేజి హిట్ సినిమా కాన్సెప్ట్ ని పట్టుకొని, యూత్ ఆడియన్స్ కి నచ్చే విధంగా డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాసుకొని పూరి జగన్నాథ్ సెన్సేషన్ క్రియేట్ చేసేసాడు. ఇదే సినిమాని అన్నీ ప్రాంతీయ భాషల్లో రీమేక్ చెయ్యగా, అన్నిట్లో బంపర్ హిట్ గానే నిల్చింది.