Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అమర్ దీప్ ఎదురుకున్నంత నెగటివిటీ ఏ కంటెస్టెంట్ కూడా ఏ సీజన్ లో ఎదురుకోలేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు నుండే అమర్ దీప్ పై ఆడియన్స్ లో ఒక అభిప్రాయం ఉంది. జానకి కలగనలేదు అనే బ్లాక్ బస్టర్ సీరియల్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు, అలాగే ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ లో అద్భుతంగా అలరించి మంచి ఆల్ రౌండర్ అని కూడా అనిపించుకున్నాడు.
హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత బయట ఆడియన్స్ చూసిన అమర్ ని హౌస్ లో మొదటి 5 వారాలు చూడలేకపోయారు. అమర్ దీప్ ఏమి చేసిన రివర్స్ అయ్యి నెగటివ్ అయ్యేది. సోషల్ మీడియా లో ఆయనకీ సమందించిన బిగ్ బాస్ వీడియోస్ ని చూస్తే ఇంత నెగటివిటీ తో టైటిల్ విన్నింగ్ రేస్ లోకి ఎలా వచ్చాడు అనిపిస్తాది.
అయితే అమర్ దీప్ కి ఈ నెగటివిటీ ఆయన జర్నీ ని పాజిటివ్ చెయ్యడానికి శివాజీ ఎంతో కారణం అయ్యాడు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొదటి వారం నుండి అమర్ దీప్ ని సూటిపోటి మాటలతో అతన్ని మెంటల్ గా బాగా డౌన్ అయ్యేలా చేసాడు శివాజీ. ఇక సోషల్ మీడియా లో అతని పీఆర్ టీం అమర్ దీప్ గురించి నెగటివ్ వీడియోలు వ్యాప్తి చేస్తూ, అమర్ కి పాజిటివ్ అయ్యేలా చేసారు. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు 24*7 లైవ్ డిస్నీ + హాట్ స్టార్ లో వస్తుంది. సోషల్ మీడియాలో ఎన్ని అబద్ధపు వీడియోస్ ని ప్రచారం చేసినా చివరికి నిజం దాచలేరు. అందుకే అమర్ ని ఇవన్నీ టైటిల్ విన్నింగ్ రేస్ లో నిలబెట్టింది.
చివరి వారం లో కూడా అమర్ పై శివాజీ పీఆర్ టీం విష ప్రచారం చేస్తూనే ఉంది. అమర్ దీప్ చివరి వారం లో కూడా ఫుడ్ ని దాచిపెడుతున్నాడని, ఇతను ఎప్పటికీ మారడు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం చేసారు. వాస్తవానికి హౌస్ లో వచ్చిన పూతరేకులు అందరూ ఒక్కొక్కటి తీసుకున్నారు. అప్పుడు అమర్ ప్రియాంక ని సంబంధించిన పూత రేకుని దాచి పెట్టి, ఆమెకి నా డ్రాయర్ లో రెండు పూతరేకులు ఉన్నాయి, ఒకటి తినేసి,మరొకటి బయట పెట్టండి అని అంటాడు. వీడియో లో అంత స్పష్టం గా కనిపిస్తున్నా కూడా అమర్ పై నెగటివిటీ ని పెంచి అతని పై మరింత జాలీ క్రియేట్ చెయ్యడం లో శివాజీ పీఆర్ టీం చివరి వారం లో కూడా సక్సెస్ అయ్యింది అంటూ అమర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.