Hyper Aadi : వృద్ధిరాలితో హైపర్ ఆది వివాహం.. జాతకం లో దోషం వల్లే పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చిందా?

- Advertisement -

Hyper Aadi : జబర్దస్త్ కామెడీ షో ద్వారా టాలీవుడ్ కి ఎంతమంది కమెడియన్స్ పరిచయమయ్యారో మనమంతా చూస్తూనే ఉన్నాం. కమెడియన్స్ గా కొనసాగుతూనే మరోపక్క హీరోలుగా కూడా మారిపోయారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్న జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. డైరెక్టర్ ఎవరైనా సరే, హైపర్ ఆది సన్నివేశాలకు హైపర్ ఆధినే డైలాగ్స్ రాసుకుంటాడు.

Hyper Aadi
Hyper Aadi

ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో ప్రతీ సన్నివేశం హిట్ అయ్యింది. అందుకే కమెడియన్ గా నేడు అలీ రేంజ్ లో కొనసాగుతున్నాడు అనే చెప్పాలి. అయితే సినిమాల్లో బిజీ గా ఉన్న హైపర్ ఆది, జబర్దస్త్ కామెడీ షో ని మానేయాల్సి వచ్చింది. కానీ ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే హైపర్ ఆది వయస్సు 40 ఏళ్లకు దగ్గర పడుతుంది.

Hyper Aadi Photos

వయసు ముదిరిపోయింది, కెరీర్ అన్నీ విధాలుగా సెటిల్ అయిపోయింది, కానీ ఇంకా ఆయన పెళ్లి చేసుకోకపోవడం పై సోషల్ మీడియా లో ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి. ఆ ట్రోల్ల్స్ మీదనే వచ్చే ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఒక స్కిట్ ని చెయ్యబోతున్నారు. హైపర్ ఆది జాతకం లో దోషం ఉన్న కారణంగా ఆయన ఒక వృద్దురాలిని పెళ్లి చేసుకోవాలట.

- Advertisement -

ఆ వృద్దురాలితో పెళ్లి జరిగిన తర్వాతే ఆయనకీ కన్నె పిల్లతో వివాహం జరుగుతుందట. ఈ కాన్సెప్ట్ మీద వచ్చిన ఈ స్కిట్ ఆడియన్స్ తో పొట్టచెక్కలు అయ్యేలా నవ్విస్తుందని అర్థం అవుతుంది. ఈ స్కిట్ లో చమ్మక్ చంద్ర కూడా పాల్గొన్నాడు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన ఈమధ్య ఈటీవీ షోస్ లో పాల్గొంటున్నాడు. ఇతను కూడా కమెడియన్ గా టాలీవుడ్ లో మంచి బిజీ అనే సంగతి మన అందరికీ తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here