Pawan Kalyan : ఇక నుండి ‘ఓజీ’ అప్డేట్స్ ఉండవు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మేకర్స్!

- Advertisement -

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలలో ఫ్యాన్స్ తో ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఓజీ’. సినిమా ప్రకటించిన రోజు నుండే అంచనాలు ఈ ప్రాజెక్ట్ పై వేరే లెవెల్ లో ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన గ్లిమ్స్ వీడియో , వర్కింగ్ స్టిల్స్ మరియు పోస్టర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Pawan Kalyan
Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కి పడితే ఇలాంటి సినిమా కదా పడాలి అని ప్రతీ ఒక్కరు అనుకున్నారు. దాదాపుగా 70 శాతం వరకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఇప్పటి వరకు నెల రోజులు పని చేసాడు. మరో నెల రోజుల పాటు ఈ సినిమాకి డేట్స్ కేటాయించాల్సి ఉంది. హైదరాబాద్, ముంబై మరియు పూణే వంటి ప్రాంతాలలో షూటింగ్స్ ని ఇప్పటి వరకు జరుపుకుంది ఈ చిత్రం.

ఇక మలేషియా లో దాదాపుగా నెల రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది, మేకర్స్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ గా ఉండడం తో ఎన్నికలు పూర్తి అయ్యేవరకు షూటింగ్స్ కి డేట్స్ కేటాయించే పరిస్థితి లేదు. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడు అన్నమాట.

- Advertisement -

అయితే ఫ్యాన్స్ చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో ఓజీ కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వమని నిర్మాతలను ట్యాగ్ చేసి అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఫ్యాన్స్ చేస్తున్న రిక్వెస్ట్ కి స్పందిస్తూ ‘మీ అందరూ ఓజీ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు..మీ ఆత్రుతని అర్థం చేసుకున్నాం, కానీ ప్రస్తుతం షూటింగ్ జరగడం లేదు, కాబట్టి అందరూ అప్డేట్ కోసం ఎదురు చూడడం ఆపేయండి..షూటింగ్ ప్రారంభం అవ్వగానే మేము అప్డేట్ ఇస్తాము’ అంటూ చెప్పుకొచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here