Vijay Devarakonda : మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియన్ స్టార్స్ గా పేరు తెచ్చుకున్న హీరోలు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అల్లు అర్జున్ మినహా, మిగిలిన హీరోలందరూ రాజమౌళి వల్ల పాన్ ఇండియన్ స్టార్స్ అయినవాళ్లే. అల్లు అర్జున్ ఒక్కడే రాజమౌళి సహకారం లేకుండా పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. ఆయన తర్వాత విజయ్ దేవరకొండ ని కూడా లెక్కలోకి తీసుకోవచ్చు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ కి కేవలం టాలీవుడ్ లో మాత్రమే క్రేజ్ వచ్చింది అనుకుంటే పొరపాటే.
టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆ చిత్రానికి కనెక్ట్ అయ్యారు. ఇదే సినిమాని హిందీ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చెయ్యగా, విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో మరింత పేరు వచ్చింది. దీంతో ఆయనకీ బాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. ఆయన హీరో గా నటించిన లైగర్ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా పాతిక కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది.
ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రానికి కూడా బాలీవుడ్ లో అంత కలెక్షన్స్ రాలేదు. అయితే యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ తీస్తున్న స్పై యూనివర్స్ లోని ‘వార్ 2’ చిత్రం లో ముందుగా విజయ్ దేవరకొండ కి ఆఫర్ వచ్చిందట. కానీ పూర్తి స్థాయి నెగటివ్ రోల్ అవ్వడం తో ఆయన చెయ్యడానికి ఇష్టపడలేదట. ఇప్పుడిప్పుడే కెరీర్ మంచి ఊపు మీద వెళ్తుంది, ఇలాంటి సమయంలో అలాంటి రిస్క్ చేయలేనని ధైర్యంగానే చెప్పేసాడు అట.
దీంతో యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఎన్టీఆర్ ని సంప్రదించడం, ఆయన వెంటనే ఈ చిత్రం లో నటించడానికి ఒప్పుకోవడం, అన్నీ అలా చకచకా జరిగిపోయాయి. స్పై యూనివర్స్ లో నటించడం అనేది సాధారణమైన విషయం కాదు. విజయ్ దేవరకొండ బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయ్యాడని బాలీవుడ్ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రం తర్వాత కచ్చితంగా బాలీవుడ్ అక్కడి స్టార్ హీరోలతో సమానంగా ఫేమ్ ని సంపాదించుకుంటాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.