Srireddy : నేను సీత.. వాడు రోత.. స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుపై విరుచుకు పడ్డ శ్రీరెడ్డి

- Advertisement -


Srireddy : ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ రెండో కుమారుడు, హీరో రానా తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్, ప్రత్యూషల పెళ్లి శ్రీలంకలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా కూడా ఈ జంటను ఆశీర్వదించగా… ఓ మహిళ మాత్రం విచిత్రంగా స్పందించింది. ఆమె మరెవరో కాదు నటి శ్రీరెడ్డి.

Srireddy
Srireddy

కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దగ్గుబాటి అభిరామ్ తనను మోసం చేశాడని ఆమె ఆరోపించారు. ఈ ఘటన గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అభిరామ్, అతని కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందించింది. రాముడు, సీతను విడదీసిన భూమి… సీత శాపాలకు నిలయం, ఆంజనేయుడి ఆగ్రహానికి గురైన భూమి.

Srireddy Videos

అశోక వనంలో సీతమ్మ, అన్నం మానేసి, స్నానం మానేసి రాముడి కోసం రోధించిన రాక్షస లంక .. శ్రీలంకలో.. దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. వహ్వా వహ్వా.. మన దేశ ఆదర్శ జంట రాముల వారిని, సీతమ్మ వారిని విడదీసిన దేశంలోనా నీ పెళ్లి? ఆహా! దైవ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఎప్పటికైనా రాక్షసులు రాక్షసులే అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ను షేర్ చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. ఆమె పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నువ్వు సీత వేంటి నీ పోస్టు చూడడం మా దరిద్రం, నిన్ను నువ్వు సీతతో పోల్చుకున్నావు చూడు! కర్మ! .. అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here