Hi Nanna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు హీరో నాని. ఆయన తాజాగా నటించిన సినిమా “హాయ్ నాన్న”. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమాతో మంచి పాజిటివ్ హిట్ అందుకోవాలి అని ఎప్పటినుంచో వెయిట్ చేశాడు. ఆయన అనుకున్నట్లుగానే కూల్ టాక్ తో ముందుకు వెళ్లిపోతున్నాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం కానీ ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని మాత్రం చెప్పుకోవచ్చు.

తెరపై తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ ని చాలా క్లియర్ గా చూపించాడు డైరెక్టర్ శౌర్యవ్. అయితే ఈ కథను ముందుగా ఆయన హీరో వరుణ్ తేజ్ కోసం రాసుకున్నారట. ఆయనకి కథ వివరించడానికి ఇంటి దగ్గరికి వెళ్లారట. కానీ అప్పటికే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠితో ముహూర్తం ఫిక్స్ చేసుకోవడంతో కొన్నాళ్ల పాటు ఏ కొత్త సినిమాకి కమిట్ అవ్వకూడదని నిర్ణయించుకున్నాడట. కథ చెబుతానన్నా వినకుండానే ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ కథలో నానినే సరిగ్గా సూట్ అయ్యాడని.. మిగతా హీరోలు ఎవ్వరూ కూడా అంతగా ఫర్ఫెక్ట్ గా సూట్ అయ్యిన్నట్లు కనిపించరు అని.. అభిమానులు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా లో శృతి హాసన్ కూడా ఓ గెస్ట్ రోల్ లో కనిపించింది..!
