Manchu Lakshmi : మంచు కుటుంబం నుండి సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేరు మంచు లక్ష్మీ ప్రసన్న. ఈమె మాట్లాడే మాటలు కొన్ని సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్ స్టఫ్ గా మారిపోతుంటాది. ఈమె ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చిందంటే మీమెర్స్ కి పండగే. నటిగా మంచు లక్ష్మీ కి మంచి పేరు అయితే వచ్చింది కానీ, అవకాశాలు మాత్రం ఎందుకో ఆ స్థాయిలో రాలేదు. ఫలితంగా కొన్ని సినిమాలు చేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది.

ఎక్కువగా ఫిమేల్ సెంట్రిక్ రోల్స్ మరియు నెగటివ్ రోల్స్ చేస్తూ వచ్చిన లక్ష్మీ ప్రసన్న, ఈమె చివరిసారిగా నటించిన చిత్రం మోహన్ లాల్ హీరో గా నటించిన ‘మాన్స్టర్’ అనే చిత్రం. ఇందులో ఈమె విలన్ రోల్ లో కనిపించింది. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదల అయ్యింది. ఇదంతా పక్కన పెడితే గత కొద్దిరోజుల క్రితం ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతం లో ఈమె ఆహా మీడియా లో వంటకి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రాం చేసింది. ఈ షో కి సంబంధించి చేసిన ప్రొమోషన్స్ లో ఆమె మాట్లాడుతూ ‘నా షో కి రామ్ చరణ్, అల్లు అర్జున్ మరియు ప్రభాస్ వంటి హీరోలు రారు’ అని అంటుంది. అప్పుడు యాంకర్ ‘ఎందుకలా’ అని అడగగా, దానికి లక్ష్మీ ప్రసన్న సమాధానం చెప్తూ ‘ఈ ప్రశ్న మీరు నన్ను కాదు, వాళ్ళని అడగాలి, నా షో అంటే వాళ్లకు చిన్న చూపు ఏమో’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

లక్ష్మీ ప్రసన్న కేవలం ఓటీటీ లోనే కాదు, ఈటీవీ మరియు జెమినీ టీవీ లో కూడా పలు షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అప్పుడు దాదాపుగా టాలీవుడ్ లో ఉన్న హీరోలందరూ హాజరు అయ్యారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు హాజరు అవ్వరు?, మంచు లక్ష్మీ మాట్లాడే మాటల్లో అర్థమే లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
