Savitri : మహానటి సావిత్రి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన అందం, అభినయంతో ఆ తరానికి చెందిన అభిమానులనే కాకుండా ఈ తరం అభిమానులను కూడా ఆకట్టుకుంది. “మహానటి” సినిమా పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఆమె జీవిత కథను తెరకెక్కించాడు. సినిమాల్లో నటించేందుకు చెన్నై వెళ్లి ఓ పల్లెటూరి అమ్మాయి.. ఛాన్స్ కొట్టేయడం.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం.. తెరపై గొప్ప నటిగా పేరు తెచ్చుకోవడం ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.

అలాగే జెమినీ గణేష్ తో నిజజీవితంలో ప్రేమలో పడడం… ఆపై సావిత్రిని ఆయన మోసం చేయడం… ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఆమె అందమైన జీవితాన్ని అంధకారంగా మార్చడం చూసి ప్రేక్షకులు చాలా బాధపడ్డారు. అయితే ఇది కాకుండా సావిత్రికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరైనా తమ ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకోవడం సర్వసాధారణం. కానీ సావిత్రి మాత్రం చిరుతను పెంచింది. ఆమె తన ఇంట్లో చిరుతపులితో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె 1950లలో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆమె 30 ఏళ్లకు పైగా వెండితెరను శాసించింది. ఇప్పుడు సావిత్రి, చిరుత కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.