Revanth Reddy : తెలంగాణ లో పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనకు టాటా చెప్తూ కాంగ్రెస్ పార్టీ కి జనాలు అధికారం అప్పచెప్పిన సంగతి మన అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తరుపున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చెయ్యబోతున్నాడు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేరు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో మారుమోగిపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

ఒక యూత్ లీడర్ గా రాజకీయ ప్రస్థానం ని మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి, నేడు ముఖ్యమంత్రి రేంజ్ కి ఎదిగాడంటే దాని వెనుక ఆయన పడిన కష్టం, చేసిన సేవలు, శ్రమ ఇలాంటివన్నీ కవర్ చేస్తూ త్వరలోనే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఒక సినిమా నిర్మిస్తానని రీసెంట్ గా జరిగిన ఒక మీడియా సమావేశం లో చెప్పుకొచ్చాడు. బండ్ల గణేష్ చాలా కాలం నుండి కాంగ్రెస్ పార్టీ తో ప్రయాణం చేస్తూ వస్తున్నాడు.

కాంగ్రెస్ పార్టీ గెలవడం తో బండ్ల గణేష్ ఆనందానికి అవధులే లేకుండా పోయింది. చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన బండ్ల గణేష్, ఇప్పుడు రేవంత్ రెడ్డి బయోపిక్ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఈ బయోపిక్ ని ఎదో చిన్న బడ్జెట్ తో తియ్యను అని, పెద్ద స్టార్ హీరోతోనే చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

రేవంత్ రెడ్డి బాల్యం నుండి మొదలై, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేవరకు జరిగిన ప్రయాణం ని సేకరించి స్క్రిప్ట్ తయారు చేయించే పనిలో ఉన్నానని ఈ సందర్భంగా బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు, క్రేజ్ ఉన్న హీరోతోనే ఈ సినిమా తీస్తాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను అంటూ బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
