Bhumika కు లవ్ లెటర్ రాసి.. ఆమె భర్తకు పంపిన అభిమాని.. భలే ఝలక్ ఇచ్చాడుగా

- Advertisement -


Bhumika : ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. భూమిక కొంతకాలం లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడి వయసు 44. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి.

Bhumika
Bhumika

అక్క, వదిన వంటి పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను కూడా చేస్తుంది. భూమిక చివరిగా తెలుగులో సీతారామం, సిటీమార్ వంటి సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే భూమిక 2007లో భరత్ ఠాకూర్‌ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.. వారిద్దరి దాంపత్యానికి గుర్తుగా ఒక కొడుకు కూడా జన్మించాడు.

Bhumika Chawla

భూమిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబందించిన పలు ఫొటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్టు చూసి అభిమానులు కంగుతిన్నారు. ఈ పోస్టులో ఓ అభిమాని తన భర్తకు ప్రేమలేఖ రాసి పంపినట్లు చెప్పింది. అలాగే ఆ అభిమాని నీ భార్యకు చెప్పు అన్నాడు. ఆ లేఖ తనను బాగా ఆకర్షించిందని భూమిక తెలిపింది. ప్రస్తుతం భూమిక పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here