NTR : టాలీవుడ్ లో నేటి తరం స్టార్ హీరోలలో మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఎవరు అని అడిగితే అందరూ చెప్పే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మూతి మీద మీసాలు కూడా సరిగా మొలవని సమయం లోనే ఆయన టాలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా, తనకి ఉన్నటువంటి అద్భుతమైన టాలెంట్ కారణంగా చెక్కు చెదరని క్రేజ్ తో ఎన్నో ఏళ్ళు కొనసాగాడు.
టెంపర్ నుండి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి తనలోని కొత్త కోణాన్ని చూపించిన ఎన్టీఆర్, #RRR చిత్రం తో పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దొరికితే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి..?, కానీ ఒక హీరోయిన్ మాత్రం ఎన్టీఆర్ ని చాలా చిన్న చూపు చూడడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తీవ్రమైన అసహనం కి గురి అయ్యేలా చేస్తుంది.
ఈమె ఎన్టీఆర్ తో ఒక్క సినిమా కూడా నటించలేదు. మన తెలుగు లో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే ఆమె హీరోయిన్ గా నటించింది. అందులో ఒక సినిమా పవన్ కళ్యాణ్ తో చేసింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిల్చింది. అలాగే మరో యంగ్ హీరో తో కూడా సినిమా చేసింది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడగగా.
ఎన్టీఆర్ అంటే ఎవరో నాకు తెలియదు, కానీ కథ నచ్చితే ఎన్టీఆర్ తో మాత్రమే కాదు, కమెడియన్ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తాను అంటూ పొగరుగా సమాధానం ఇచ్చింది. గతం లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో ఈమె ట్విట్టర్ లో గొడవలు కూడా పడింది. ఇప్పటికీ ఎన్టీఆర్ మీద అదే నెగటివిటీ మైండ్ తో ఉండడం పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రమైన కోపం తో ఉన్నారు.