Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంత ఆసక్తికరంగా సాగిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అలా చూస్తూ ఉండగానే 13 వారాలు అయిపోయింది. ఈ సీజన్ టీఆర్ఫీ రేటింగ్స్ పరంగా, రెవిన్యూ పరంగా వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ అయ్యిందని టాక్. అదంతా పక్కన పెడితే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ ఒక్కరు ఎదో ఒక స్ట్రాటజీ, మాస్క్ వేసుకొని హౌస్ లో ఇన్ని రోజులు కొనసాగుతూ వచ్చారు.

కానీ అమర్ దీప్ మాత్రం ఎలాంటి మాస్క్, స్ట్రాటజీ లేకుండా తన నిజమైన స్వభావం తో ఇన్ని రోజులు హౌస్ లో కొనసాగాడు. మొదట్లో ఇతని ప్రవర్తన చూసి జనాలకు చిరాకు వచ్చింది. ఆ తర్వాత ఇతను మంచోడే, కాకపోతే చిన్న పిల్లాడి మనస్తత్వం అని అనిపించింది. మొదట్లో టాస్కులు సరిగా ఆడలేదు అని అనిపించుకున్నాడు, ఆ తర్వాత ప్రతీ టాస్కు గెలవడానికే ఆడాడు.

గత రెండు వారాలు కెప్టెన్సీ టాస్కు విషయం లో అమర్ ని హౌస్ మేట్స్ టార్గెట్ చేసి రాకుండా చేసారు, ఈ రెండు వారాలు అమర్ దీప్ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది. ఇక ఈ వారం ‘టికెట్ టు ఫినాలే’ టాస్కు లో ప్రతీ గేమ్ ని అద్భుతంగా ఆడి రన్నరప్ గా నిలిచాడు. అందుకే నాగార్జున ఈ వారం ఆయన్ని ఇంటి కెప్టెన్ గా చేసాడు, కానీ ఎలాంటి ఇమ్మ్యూనిటీ కూడా లేదు, నామినేషన్స్ లోకి రావాల్సిందే అట.

ఇదంతా పక్కన పెడితే ఈ వారం శోభా శెట్టి మరియు గౌతమ్ డేంజర్ జోన్ లో ఉన్నారట. ఈ ఇద్దరు ఈ వారం లో ఆడింది ఏమి లేదు, అందుకే వీళ్ళు డేంజర్ జోన్ లోకి వచ్చారు. వీరిలో గౌతమ్ ఎలిమినేట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ప్రశాంత్ దగ్గర ఏవిక్షన్ పాస్ ఉంది కదా, దానిని ఉపయోగించి గౌతమ్ ని సేవ్ చేస్తాడేమో చూడాలి.
