Mansoor Ali Khan : హీరోయిన్ త్రిష కు.. నటుడు మన్సూర్ ఆలీఖాన్ కు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. లియో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మన్సూర్.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలయ్యింది. త్రిషతో రేప్ సీన్స్ ఉంటాయని అనుకున్నాను అంటూ మన్సూర్ చెప్పుకొచ్చాడు. ఒక నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అభిమానులు ఫైర్ అయ్యారు. అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం త్రిషకు సపోర్ట్ గా నిలబడింది.

కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్ లో కూడా మెగాస్టార్ చిరు, నితిన్ లాంటి వారు కూడా త్రిషకు సపోర్ట్ చేసారు. ఇక కోర్టు వరకు కూడా ఈ వివాదం చేరింది. ఈ మధ్యనే మన్సూర్ త్రిషకు సారీ చెప్పడం, ఆమె ఆ సారీని అంగీకరించడం జరిగాయి. అయితే ఇంతలోన మన్సూర్ ప్లేట్ తిప్పేశాడు. నేను.. త్రిషకు సారీ చెప్పడం ఏంటి.. అది పెద్ద జోక్. మా మేనేజర్ నన్ను చంపేయండి.. అన్న మాటను నన్ను క్షమించండి అని అర్ధం చేసుకొని అలాంటి ప్రకటన చేసాడు అని చెప్పుకొచ్చాడు. ఈ వివాదం ఇలా కొనసాగుతుంటే.. పోలీసులు మన్సూర్ ను అరెస్ట్ చేశారు.

తాజాగా త్రిష.. మన్సూర్ ఆలీ ఖాన్ ను వదిలేయమని లేఖ రాసినట్లు కోలీవుడ్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.‘‘మన్సూర్ నాకు సారీ చెప్పాడు. తప్పులు అందరూ చేస్తారు.. మానవత్వంతో సర్దుకుపోవాలి.. దయచేసి పోలీసులు.. మన్సూర్ ను వదిలేయాలని కోరుకుంటున్నాను.. ఆయనపై చర్యలు తీసుకోకండి” అని రాసినట్లు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.