Actor Ashish : ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది టాలీవుడ్ యంగ్ హీరోస్, హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుని తమ బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. పెళ్లితో వారంతా ఓ ఇంటి వారు అయిపోతున్నారు. ఇక ఇటీవల లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ వివాహ బంధంతో ఒక్కటై జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంకటేష్ రెండో కూతురు నిశ్చితార్థం కూడా అయిపోయింది. తాజాగా మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా నిర్మాణ రంగంలో ఉన్న సంగతి తెలిసిందే.
దిల్ రాజుకు కొడుకులు లేకపోవడంతో ఆయన వారసుడిగా శిరీష్ కొడుకు ఆశిష్‌ను సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాడు. రౌడీ బాయ్స్ అనే సినిమాతో ఆశిష్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే సెల్ఫిష్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం మూడో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆశిష్.
మూడో సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు ఈలోపే పెళ్లితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైపోయాడు. ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త కూతురు అద్విత రెడ్డితో.. ఆశిష్ ఎంగేజ్ మెంట్ గ్రాండ్ లెవెల్లో జరిగింది. చాలా సైలెంట్‌గా ఆశిష్ – అద్విత నిశ్చితార్థం పూర్తి చేశారు. ఎటువంటి హడవుడి లేకుండా ఈ ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది.
ఈ ఎంగేజ్మెంట్ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక చాలామంది ప్రముఖులు ఈ జంటకు విషెష్ చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల దిల్ రాజు ఇంట్లో విషాదం జరిగిన సంగతి తెలిసిందే. విషాదం జరిగిన ఇంట్లో ఏడాది లోపే శుభకార్యం జరిగితే మంచిదంటారు. అందుకే ఈ కుటుంబ ఆశిష్ పెళ్లిని ఇంత సడన్ గా ప్లాన్ చేశారని తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత నిర్మాతగా మారి.. తను చేసిన ప్రతి సినిమాతో సక్సెస్ అందుకుని స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు దిల్ రాజు.