Salaar Movie : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సలార్ కు సినిమాకు ఫ్రీ టికెట్స్..?

- Advertisement -


Salaar Movie : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ ట్రైలర్ నేడు డిసెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

salaar movie
Salaar Movie

మరి ఈ ట్రైలర్‎కి ముందుగా మేకర్స్ అలర్ట్ పోస్ట్‌ల‌ను పెడుతున్నారు. ఇక లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ అభిమానుల్లో చాలా ఆసక్తిని రేపుతుంది. ఇక మేకర్స్ ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి ప్రభాస్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు సంబంధించిన ఓ మూమెంట్ స్టిల్ షేర్ చేశారు. ఈ పిక్‌కి పర్ఫెక్ట్ క్యాప్షన్ చెప్పిన ఓ అయిదుగురికి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ఉచితంగా ఇస్తామంటూ కన్ఫామ్ చేశారు.

salaar teaser

అంతేకాకుండా లేటెస్ట్ గా స్టార్ట్ చేసిన సలార్ మర్చండైజ్‌ కూడా గిఫ్ట్ గా అందించబోతున్నట్లు వివరించారు. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరూ వారికి తోచిన క్యాప్షన్ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఆ ఐదుగురు అదృష్టవంతులు ఎవరో.. ఆడియన్స్ లో తమ క్రియేటివ్ క్యాప్షన్లతో ఈ టికెట్లను ఎవ‌రు సొంతం చేసుకుంటారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here