Nagarjuna : ఇండస్ట్రీ లో ఒక హీరో పెద్ద స్టార్ అవ్వాలంటే అందం, టాలెంట్ మరియు లక్ తో పాటుగా క్రమశిక్షణ కూడా ఉండాలి. వీటిల్లో ఏది లేకపోయినా సదరు హీరో స్టార్ కాలేడు. ముఖ్యంగా ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ లాంటి లెజెండ్స్ నుండి ఇలాంటి లక్షణాలను నేర్చుకున్నారు తర్వాతి తరం హీరోలు, హీరోయిన్లు. అంత పెద్ద స్టార్ హీరోలు అయ్యుండి కూడా, వాళ్ళు అనుసరించే కొన్ని పద్దతులను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. అక్కినేని నాగేశ్వర రావు గారిని అందరూ ముక్క సూటి మనిషి అని అంటూ ఉంటారు.

ఆయన లెజెండ్ అవ్వడానికి, ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా పది కాలాలు ఆయన పేరు వినపడే స్థాయి రావడానికి ముఖ్య కారణం ఆయన పాటించిన క్రమశిక్షణ వల్లే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నాగార్జున గారు క్రమశిక్షణ విషయం లో నాగేశ్వర రావు గారు ఎంత కఠినంగా ఉండేవారో చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘నాన్న గారికి క్రమశిక్షణ లేకపోతే చాలా కోపం. చిన్న తనం లో నేను చాలా అల్లరి చేసేవాడిని. ఒకరోజు ఇంటికి డైరెక్టర్ వచ్చి నాన్న గారికి కథ వినిపిస్తున్నాడు. ఆ సమయం లో నేను ఆడుకుంటూ అల్లరి చేశాను. నాన్న గారు పదే పదే కాసేపు సైలెంట్ గా ఉండు అని చెప్పినా నేను వినలేదు. ఆ తర్వాత డైరెక్టర్ వెళ్ళిపోయాక నాన్న గారు నాకు ఫుల్ కోటింగ్ ఇచ్చేసారు. ఇది జరిగిన కొన్ని రోజులకు మరోసారి అల్లరి చేసి ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టాను. ఇది తెలిస్తే నాన్న గారి చేతిలో నాకు మూడింది అనే విషయం అర్థం చేసుకొని గోడ దూకి ఇంట్లో నుండి పారిపోయాను. ఇది తెలుసుకున్న నాన్న నీకు క్రమశిక్షణ, జీవితం విలువ తెలియాలని నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ కి తీసుకెళ్లి, ప్యాంట్ లేకుండా రెండు రోజులు తిరిగేలా చేసాడు. జీవితం అంటే ఇలా ఉంటుంది, కష్టం అంటే ఇలా ఉంటుంది, వీటి విలువ తెలియకపోతే ఉన్నత స్థాయికి చేరుకోవడం చాలా కష్టం అని చెప్పాడు ‘ అంటూ నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.